SHRAMADANAM AIMS AT KEEPING TIRUMALA ENVIRONS CLEAN AND HYGIENE-TTD EO _ తిరుమల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే శ్రమదానం లక్ష్యం – టీటీడీ ఈవో
TIRUMALA, 02 AUGUST 2022: Shramadanam is aimed at keeping Tirumala environs clean and hygienic and all the locals should be a part in this noble activity, said TTD Sri AV Dharma Reddy.
Participating in the Shramadanam activity along the senior officers of Tirumala held under the aegis TTD Health Wing and Estates department at Balaji Nagar area in Tirumala the EO called up the locals to join hands in this noble activity and observe the programme every fortnight.
Nearly 200 members comprising TTD officials, locals, security personnel, and sanitary staff participated in the event with enthusiasm and cleared debris and scrap materials in the colonies.
SE2 Sri Jagadeeshwar Reddy, Health Officer Dr Sridevi, Estates Wing Special Officer Sri Mallikarjuna, VGO Sri Bali Reddy and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే శ్రమదానం లక్ష్యం – టీటీడీ ఈవో
తిరుమల, 2022 ఆగస్టు 02: భూలోక నందనవనమైన తిరుమల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా శ్రమదానం చేస్తున్నామని, ఈ మహత్తర కార్యక్రమంలో స్థానికులందరూ భాగస్వాములు కావాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డి అన్నారు. తిరుమలలోని బాలాజీ నగర్‌లో టీటీడీ ఆరోగ్య మరియు ఎస్టేట్స్ విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం శ్రమదానం కార్యక్రమం జరిగింది.
ప్రతి పదిహేను రోజులకోసారి టీటీడీ సీనియర్ అధికారులతో కలిసి నిర్వహిస్తున్న శ్రమదానం కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈవో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, స్థానికులు, భద్రతా సిబ్బంది, శానిటరీ సిబ్బందితో కూడిన దాదాపు 200 మంది ఉత్సాహంగా పాల్గొని కాలనీల్లోని చెత్తాచెదారం తొలగించారు.
ఎస్‌ఈ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, ఎస్టేట్స్ విభాగం ప్రత్యేకాధికారి శ్రీ మల్లికార్జున, విజివో శ్రీ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.