SIGNBOARD IN OTHER LANGUAGES NEEDED IN TIRUMALA-EO_ తిరుమలలో ఇతర భాషల్లోనూ సూచికబోర్డులు ఏర్పాటుచేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 18 September 2017: TTD EO Sri Anil Kumar Singhal today directed officials to put up sign board in other languages.

During his Monday review at the TTD Adminstrative Building in Tirupati, the EO directed the officials of the engineering department, that sign boards should be written in Tamil, Kannada and Hindi also to direct devotees to all crucial places in Tirumala.

He also wanted the officials to take steps to redesign the Laddu plastic covers and also initiate measures to enhance the lighting of the Srivari Temple and surroundings.

The meeting also discussed in length on speeding up of the link road in front of the new Srivari Sadan building, amendments based on an expert committee report on Swachch Tirumala , technology updation to resolve solid waste management and need to consult interested agencies for removal of non-degradable wastes at Tirumala.

The EO also wanted the speeding up of the Go-Pradakshinalaya building at Alipiri, Hospital buildings at Tirchanoor near Sri Padmavathi Ammavari Temple, shopping complex,Compartments for waiting devotees, shifting of luggage and chappal counters in front of Srivari temple and pending engineering works at Sri Kapileswara SwamyTemple at Tirupati and the Sri Venkateswara temple at Upamaka.

Among others JEOs Sri KS Srinivasa Raju,, Sri Pola Bhaskar, CVSO Sri Ake Ravikrishna, Chief engineer Sri Chandrasekhar Reddy, Additional FACAO Sri O Balaji and others were also present.


ISSUED BY PUBLIC RELATIONSOFFICER, TTDs, TIRUPATI

తిరుమలలో ఇతర భాషల్లోనూ సూచికబోర్డులు ఏర్పాటుచేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

సెప్టెంబర్‌ 18, తిరుపతి, 2017: తిరుమల శ్రీవారి దర్శనార్థం ఇతర భాషల భక్తులు కూడా అధికంగా విచ్చేస్తున్నారని, వారందరికీ అర్థమయ్యేలా ఆయా భాషల్లో సూచికబోర్డులు ఏర్పాటుచేయాలని టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. తిరుమలలో ఎక్కడెక్కడ ఏయే ప్రాంతాలున్నాయి, వాటిని ఎలా చేరుకోవాలి తదితర సమాచారంతో సూచిక బోర్డులను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో సోమవారం సీనియర్‌ అధికారులతో ఈవో వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రస్తుతం వినియోగిస్తున్న శ్రీవారి లడ్డూ కవర్లలో మార్పులు తీసుకొచ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. శ్రీవారి ఆలయం, పరిసర ప్రాంతాల్లో లైటింగ్‌ పెంచేందుకు అవసరమైన డిజైన్లు వెంటనే రూపొందించాలని ఆదేశించారు. బ్రహ్మూెత్సవాల సందర్భంగా తిరుమలలోని నూతన శ్రీవారి సేవాసదన్‌ ముందుగల లింకు రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. తిరుమలలో పరిశుభ్రతకు సంబంధించి నిపుణులు చేసిన సిఫార్సులతో నివేదిక రూపొందించాలన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని, బయోడిగ్రేడబుల్‌, నాన్‌ బయోడిగ్రేడబుల్‌ వ్యర్థాలను తొలగించేందుకు ఆసక్తి గల సంస్థలను సంప్రదించాలని ఆదేశించారు.

అలిపిరి వద్ద గోప్రదక్షిణశాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఈవో సూచించారు. తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఆసుపత్రి భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, ఆ తరువాత దశలో షాపింగ్‌ కాంప్లెక్స్‌, భక్తులు వేచి ఉండేందుకు కంపార్ట్‌మెంట్ల నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. శుక్రవారపుతోటలో ఆలయ కార్యాలయ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని, ఆలయం ఎదురుగా ఉన్న లగేజి, పాదరక్షల డిపాజిట్‌ కౌంటర్లను మరో చోటకు మార్చాలని ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయం, ఉపమాకలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పెండింగ్‌లో ఉన్న ఇంజినీరింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీపోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీఓ.బాలాజి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.