శ్రీ‌వారి ఆల‌యంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం _ SIGNIFICANCE OF SRIVARI VAIKUNTADWARA DARSHANAM

Tirumala, 16 December 2023: As per the Vaishnava tradition, TTD is organising the ten-day Vaikuntadwara Darshanam at Tirumala Srivari temple from December 23 to January 1 for ten days.

According to the Puranic legend, the importance attached to this unique Vaikuntadwara Darshanam is depicted in an interesting manner.

One day in Vaikunta-the sacred abode of the Universal Protector-Sri Maha Vishnu is considered equivalent to one year on earth.

The 12 hours of daytime in that one day is equal to six six-month period of Uttarayanam while the remaining 12 hours of night is equal to the remaining six months of Dakshinayanam on earth.

In that one day, the early morning 120 minutes in Vaikuntam is equal to 30 days of Dhanurmasa on earth and Sri Maha Vishnu gives Darshan to all the other deities, sages, devotees for 40 minutes during Brahma Muhurtam which is equal to the ten days of Vaikunthadwara Darshanam. These days are being treated as most sacred in begetting the divine bliss. The devotees shall have the Vaikunthadwara Darshanam of Sri Venkateswara Swamy in Tirumala on any of these ten days.

Other details:

Since rooms are limited at Tirumala, the devotees are requested to opt for rooms in Tirupati during these ten days.

As in past break Darshan is provided to VIPs on the protocol list only and no recommendation letters is accepted and granted.

Since the impact of Vaikuntadwara Darshan lasts on all ten days, VIPs and other devotees need not feel stress to get Vaikuntadwara Darshanam on Vaikunta Ekadasi day itself. They should make plans to have a comfortable Darshan on any of these ten days.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి ఆల‌యంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

తిరుమల, 2023 డిసెంబరు 16: వైష్ణ‌వాల‌యాల సంప్ర‌దాయాల‌ను పాటిస్తూ తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌రు 23 నుండి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వారం 10 రోజుల పాటు తెర‌చి ఉంచి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నభాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

– పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం విశిష్ట‌త ఇలా ఉంది. వైకుంఠంలో శ్రీ‌మ‌హావిష్ణువుకు ఒక రోజు అంటే భూలోకంలో ఒక సంవ‌త్స‌రం అని అర్థం. అదేవిధంగా అక్క‌డ ప‌గ‌లు 12 గంట‌లు ఇక్క‌డ 6 నెల‌లు ఉత్త‌రాయ‌ణం, రాత్రి 12 గంట‌లు ఇక్క‌డ 6 నెల‌లు ద‌క్షిణాయణం.

– వైకుంఠంలో తెల్ల‌వారుజామున 120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానం. దీన్ని ధ‌నుర్మాసంగా పిలుస్తున్నాం. తెల్ల‌వారుజామున బ్ర‌హ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీ‌మ‌హావిష్ణువు దేవ‌త‌ల‌కు, ఋషుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. ఇది వైకుంఠంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. భూలోకం కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒకసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది.

– ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులకు స‌మానం కాబ‌ట్టి వైష్ణ‌వాల‌యాలలో ఈ 10 రోజుల‌లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకుంటే శ్రీ‌మ‌హావిష్ణువును ప్ర‌త్య‌క్షంగా ద‌ర్శ‌నం చేసుకున్న భాగ్యం క‌లుగుతుంది అనేది న‌మ్మ‌కం. కాబ‌ట్టి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఈ 10 రోజుల‌లో ఏరోజు చేసుకున్నా అన్ని రోజులూ స‌మాన‌మే. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ద‌ర్శ‌నానికి రావాల్సిందిగా విజ్ఞ‌ప్తి.

– తిరుమ‌ల‌లో గ‌దులు ప‌రిమితంగా ఉన్న కార‌ణంగా ఈ ప‌ర్వ‌దినాల‌లో భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా తిరుప‌తిలో గ‌దులు పొందాల్సిందిగా భ‌క్తులకు విజ్ఞ‌ప్తి చేస్తున్నాం.

– గ‌తంలో వ‌లెనే ఈ సంవ‌త్స‌రం కూడా స్వ‌యంగా వ‌చ్చే ప్రోటోకాల్ విఐపిల‌కు ప‌రిమితంగా మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నం ఇవ్వ‌బ‌డుతుంది. సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు.

– వైకుంఠ ద్వార ద‌ర్శ‌న ఫ‌లితం 10 రోజ‌లు పాటు ఉంటుంది. కావున విఐపిలు, ఇత‌ర భ‌క్తులు తొలిరోజైన వైకుంఠ ఏకాద‌శి రోజు మాత్ర‌మే ద‌ర్శ‌నం చేసుకోవాల‌నే తొంద‌ర‌పాటు లేకుండా ప‌ది రోజుల్లో ఏదో ఒక‌రోజు ద‌ర్శ‌నం చేసుకోవ‌డానికి ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవాల్సిందిగా కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.