SILA SANGRAHANAM ON JULY 4_ జూలై 4న రామ‌పురం వ‌ద్ద శ్రీ‌వారి విగ్ర‌హానికి శిలా సంగ్ర‌హ‌ణ‌ం – తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం

Tirupati, 28 Jun. 19: The auspicious muhurat for the preparation of the idol of Mula Virat for the Sri Venkateswara Divya Kshetram which is coming up at Amaravathi will commence on July 4 at Ramapuram near Tirupati, said JEO Sri B Lakshmikantham.

A review meeting with officials associated with the event was organised in the bunglow of JEO in Tirupati on Friday evening. Speaking on the occasion the JEO said, the Agama advisors have fixed the timings between 7.30am and 9am on that day for “Sila Sangrahanam”, he added.

The JEO said, TTD Chaiman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal will also take part in the Punyahavachanam, Homam and other vedic rituals which will be conducted on that day before commencing the sacred sculpting work.

Agama Advisor Sri Sunderavadanacharyulu, CE Sri Chandrasekhar Reddy, DyEO Sri Harindranath, OSD Tirumala temple Sri P Seshadri and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 4న రామ‌పురం వ‌ద్ద శ్రీ‌వారి విగ్ర‌హానికి శిలా సంగ్ర‌హ‌ణ‌ం – తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం

తిరుపతి, 2019 జూన్ 28: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి సమీపంలోని వెంకటపాలెం గ్రామంలో టిటిడి నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్యక్షేత్రంలో ప్ర‌తిష్టించేందుకు తిరుపతి సమీపంలోని రామాపురం గ్రామం వద్ద జూలై 4వ తేది గురువారం ఉదయం 7.30 నుండి 9.00 గం.టల వరకు శిలా సంగ్ర‌హ‌ణ‌ం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం తెలిపారు. తిరుప‌తిలోని జెఈవో నివాసంలో శుక్ర‌వారం శిలా సంగ్ర‌హ‌ణ‌ంపై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి ఆగ‌మ స‌ల‌హాదారులు, అర్చ‌కులు, స్త‌ప‌తి సూచ‌న మేర‌కు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా పుణ్యాహ‌వ‌చ‌నం, హోమం, కైంక‌ర్యాలు త‌దిత‌ర వైదిక కార్యాక్ర‌మాల‌ను చేపడతామన్నారు. టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించామన్నారు. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన వీడియోను టిటిడి వెబ్ సైట్ ను పొందుపరచామని, దాతలు ఆ వీడియోను వీక్షించి స్వచ్చంధంగా ఆన్ లైన్ లో విరాళాలు అందించేలా ఏర్పాట్లు చేపట్టామన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఆగమ సలహాదారులు శ్రీ ఎన్.ఏ.కే. సుందరవరదన్, సిఈ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, ట్రాన్స్ పోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి, టిటిడి డిప్యూటీ ఈవోలు శ్రీ హరీంధ్రనాథ్, శ్రీ విశ్వనాథం, ఆలయ ఓఎస్డి శ్రీ పాల శేషాద్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.