SILKS PRESENTED TO AMMAVARU _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి బోర్డు సభ్యులు డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
Tiruchanoor, 15 Nov. 20: TTD Trust Board Ex-officio member Dr C Bhaskar Reddy has presented Silk Vastrams to Sri Padmavathi Devi at Tiruchanoor on Sunday.
Speaking to media on this occasion, he said, he has been offering the silks on behalf of Tummalagunta Sri Kalyana Venkateswara Swamy temple on the day of Gaja Vahana Seva at Tiruchanoor every year since many years. He said every year he offers the Vastrams in Padayatra from Tummalagunta to Tiruchanoor as temple tradition.
JEO Sri P Basanth Kumar, Agama Advisor Sri Srinivasacharyulu, DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి బోర్డు సభ్యులు డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
తిరుపతి, 2020 నవంబరు 15: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే, తుడ ఛైర్మన్, ప్రభుత్వ విప్ అయిన డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న డా. భాస్కర్‌రెడ్డికి ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా డా. భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో గజ వాహనం సందర్భంగా తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం నుంచి పట్టువస్త్రాలను ఆనవాయితీగా సమర్పిస్తున్నట్టు తెలిపారు. తుమ్మలగుంట నుంచి తిరుచానూరుకు పాదయాత్రగా వచ్చి పట్టువస్త్రాలు సమర్పించామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.