SIMHA VAHANAM MARKS THE POWER OF LORD SHIVA_ శ్రీ‌క‌పిలేశ్వ‌రాల‌యంలో సింహ వాహనం

Tirupati, 8 Feb. 18: On the third day evening on Sunday, Lord Sri Soma Skanda Murthy was taken for a celestial ride on Simha Vahanam in the avatar of Paramashiv and Mrugaraju as a part of the ongoing annual Brahmotsavams in Sri Kapila Teertham temple.

The devotees who thronged the streets to catch a glimpse of Lord on Simha Vahanam, were mused by His divine charm.

Temple DyEO Sri Subramanyam, Suptd Sri Obul Reddy, Temple Inspectors Sri K Narayana, Sri Muralikrishna, AVSO Sri Raju, Exe Engineer Sri Jagadeeswara Reddy and others took part in the event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీ‌క‌పిలేశ్వ‌రాల‌యంలో సింహ వాహనం

తిరుపతి, 2018 ఫిబ్రవరి 07: తిరుప‌తిలోని శ్రీ కపిలేశ్వ‌రాల‌యంలో గురువారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సింహ వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. మృగరాజు సింహం. దేవతల్లో అత్యంత ఉత్కృష్టుడు పరమేశ్వరుడు. భక్తుల హృదయం గుహ వంటిది. ఆ గుహలో సింహం వంటి ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంచుకుంటే జీవుడు ఏ భయాన్ని పొందడు. మృగరాజు వంటి శివపరమాత్మ కొలువై అభయమిచ్చి జీవనాన్ని పాలిస్తుంటే, అరిషడ్వర్గాలనే క్షుద్ర మృగాల భయం ఉండదు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ శంకరరాజు, ప్రధానార్చకులు శ్రీ మణిస్వామి, ఎవిఎస్‌వో శ్రీగంగరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నారాయణ, శ్రీసి.మురళీక ష్ణ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.