SITARAMA KALYANAM IN SRI KRT ON SEPT.15_ సెప్టెంబరు 15న శ్రీకోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం

Tirupati, 10 Sep. 17: The Kalyanotsavam of Sri Sita and Sri Kodanda Rama Swamy will be conducted in the temple of Sri Kodanda Rama Swamy in Tirupati on September 15 on the advent of Punarvasu Nakshatram.

After the morning sevas, the celestial wedding commences by 11am and grihastas said can take part in this fete on payment of Rs.500 per ticket on which two persons will be allowed.

They will be provided with darshan of presiding deities, one upper cloth, one blouse piece and a laddu and vada.

Later in the evening, the Unjal Seva will be performed at Ramachandra Pushakarini by 5:30pm.

SAHASRAKALASABHISHEKAM AND HANUMANTHA VAHANAMS ON SEPT.20

While the Sahasra Kalasabhishekam will be performed to the utsava murthies on September 20 in this famous shrine. The grihastas can take part in this fete on payment of Rs.500 per ticket on which two persons will be allowed.

This celestial ritual takes place between 6am and 8am.

While in the evening, the processional deity of Lord Sri Kodada Rama Swamy will take ride on His favourite vehicle Lord Hanuman and bless the devotees in four Mada streets surrounding the temple between 7pm and 9pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

సెప్టెంబరు 15న శ్రీకోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం

తిరుపతి, 2017 సెప్టెంబరు 10: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సెప్టెంబరు 15వ తేదీ శుక్రవారం శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా ఉదయం 11.00 గంటలకు శ్రీసీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం, అక్కడే ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

సెప్టెంబరు 20న ఆలయంలో సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ:

శ్రీకోదండరామాలయంలో సెప్టెంబరు 20వ తేదీ బుధవారం అమావాస్యనాడు సహస్రకలశాభిషేకం, హనుమంత వాహనసేవ వైభవంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 6.00 నుండి 8.00 గంటల నడుమ సహస్ర కలశాభిషేకంసేవ వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.

సాయంత్రం 7.00 నుంచి రాత్రి 9.00 గంటల నడుమ హనుమంత వాహనసేవ జరుగనుంది. హనుమంతుడిని ‘సంకట మోచన’గా పిలుస్తారు. అనగా దుష్టశక్తులను నశింపజేసి చెడు ఆలోచనలను దూరం చేస్తాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రం తదితర పర్వదినాలకు చాలా విశిష్టత ఉంటుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.