SIX NANDI AWARDS TO SVBC _ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు 6 నంది అవార్డులు

Tirupati, 25 June 2013: The TTD-run Sri Venkateswara Bhakti Channel(SVBC) has won the prestigious Nandi Awards in various categories for the year 2011.

The awards ceremony took place on 22nd June in Gadwal of Mahaboobnagar district. The Chief Executive Officer of SVBC Dr P Madhusudhana Rao received the awards from hon’ble minister of State Information and Public Relations Smt DK Aruna.

SVBC was launched in the year 2008 with a mission to propagate and promote the embedded values in Hindu Sanatana Dharma. The channel today is the most sought after spiritual channel across the globe as it relays the live programmes of the various festivals that are being conducted in the world famous temple of Lord Venkateswara in Tirumala, TTD sub-temples, other temples in the country, spiritual discourses, mythological serials etc. 

Meanwhile SVBC won six Nandis for best mega serial, TV documentary and TV Feature for the year 2011. In the Best TV Mega Serial category, Senior Producer Sri T Srinivasa Rao has won Golden Nandi for Best Director and Bronze Nandi Best Producer category.

 In Best TV Documentary Category, SVBC senior Cameraman Sri CH Tirumala Rao won Golden Nandi Best Producer award as well Bronze Nandi in Best Directory Category for the documentary “Nagoba Jatara”.

Under Best TV Feature category, Senior Producer Sri D Padmanabha Rao won Golden Nandi Award for Best Producer and Bronze Nandi for Best Director for the feature “Brahma Mokkate”.

TTD Chairman Sri K Bapiraju,  EO Sri LV Subramanyam and other officials complimented the SVBC for its achievements.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు 6 నంది అవార్డులు

తిరుమల, జూన్‌ 25, 2013: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు 2011వ సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆరు నంది అవార్డులు వరించాయి. జూన్‌ 22వ తేదీన మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీమతి డి.కె.అరుణ ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఎస్వీబీసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ పాలకుర్తి మధుసూదనరావు మంత్రి చేతులమీదుగా నంది అవార్డులను అందుకున్నారు.
హైందవ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా 2008వ సంవత్సరంలో తితిదే శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ను ప్రారంభించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవాలు, ఇతర విశేషాలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, పౌరాణిక ధారావాహికలు ప్రసారం చేస్తూ ఛానల్‌ అనతికాలంలోనే భక్తుల మన్ననలు చూరగొంది. 2011వ సంవత్సరానికి గాను ఉత్తమ టివి మెగా సీరియల్‌, ఉత్తమ టివి డాక్యుమెంటరీ, ఉత్తమ టివి ఫీచర్‌ విభాగాల్లో మొత్తం ఆరు నందులను ఎస్వీబీసీ కైవసం చేసుకుంది.
ఉత్తమ టివి మెగా సీరియల్‌ విభాగంలో ”నాయన”కు ఉత్తమ నిర్మాత అవార్డు కింద బంగారు నంది, ఉత్తమ దర్శకుడు అవార్డు కింద ఎస్వీబీసీ సీనియర్‌ ప్రొడ్యూసర్‌ శ్రీ టి.శ్రీనివాస రావుకు రాగి నంది దక్కాయి.

ఉత్తమ టివి డాక్యుమెంటరీ విభాగంలో ”నాగోబ జాతర”కు ఉత్తమ నిర్మాత అవార్డు కింద బంగారు నంది, ఉత్తమ దర్శకుడు అవార్డు కింద ఎస్వీబీసీ సీనియర్‌ కెమెరామెన్‌ శ్రీ సిహెచ్‌.తిరుమలరావు రాగి నంది కైవసం చేసుకున్నారు.

అదేవిధంగా ఉత్తమ టివి ఫీచర్‌ విభాగంలో ”బ్రహ్మమొక్కటే”కు ఉత్తమ నిర్మాత అవార్డు కింద వెండి నంది, ఉత్తమ దర్శకుడు అవార్డు కింద ఎస్వీబీసీ సీనియర్‌ ప్రొడ్యూసర్‌ శ్రీ డి.పద్మనాభ రావుకు రాగి నంది దక్కాయి.

నంది అవార్డులు సాధించిన ఎస్వీబీసీ సిబ్బందిని తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇతర అధికారులు అభినందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.