SIXTH PHASE BALAKANDA AKHANDA PARAYANAM ON JAN 31 _ జనవరి 31న 6వ విడ‌త‌ అఖండ బాలకాండ పారాయ‌ణం

Tirumala, 27 Jan. 22: The sixth phase Balakanda Akhanda Parayanam will take place in Nadaneerajanam platform at Tirumala on January 31.

A total of 134 shlokas from 23 to 26 chapters will be recited on the occasion.

SVBC will live telecast the event between 7am and 9am for the sake of global devotees.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

జనవరి 31న 6వ విడ‌త‌ అఖండ బాలకాండ పారాయ‌ణం

తిరుమల, 2022 జనవరి 27: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై జనవరి 31వ తేదీ సోమవారం 6వ విడ‌త‌ అఖండ బాలకాండ పారాయణం జ‌రుగ‌నుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

బాలకాండలోని 23 నుండి 26 సర్గల వ‌ర‌కు గ‌ల 134 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి. వేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్,  జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల అధికారులు, పండితులు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.