SKVST GEARS UP FOR V-DAY _ వైకుంఠ ఏకాదశికి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం ముస్తాబు

TIRUPATI, 22 DECEMBER 2022: Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram is gearing up for Vaikuntha Dwara Darshanam.

As Vaikunta Ekadasi and Vaikunta Dwadasi are scheduled on January 2 and 3 respectively, Vaikunta Dwaram will be set up in the temple for the sake of devotees.

On January 2, on the auspicious Vaikunta Ekadasi day, the Bangaru Tiruchi procession will be observed between 8am and 9am while on January 3 on Vaikunta Dwadasi Chakrasnanam will be performed between 10 am and 11 am.

On these two days, TTD has cancelled Arjita Kalyanotsavam.

Elaborate arrangements are underway to match the occasion for devotees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైకుంఠ ఏకాదశికి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం ముస్తాబు

తిరుపతి, 2022 డిసెంబరు 22: జనవరి 2, 3వ తేదీలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. తిరుమల శ్రీవారిని సందర్శించుకోలేని భక్తుల సౌకర్యార్థం శ్రీనివాసమంగాపురంలో వైకుంఠద్వారం ఏర్పాటు చేయనున్నారు.

జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 12.30 గంటల వరకు తిరుపల్లచ్చితో శ్రీవారిని మేల్కొలుపుతారు. 12.30 నుండి 3.00 గంటల వరకు మూలవర్లకు తోమాల సేవ, కొలువు తదితర సేవలను నిర్వహిస్తారు. ఉదయం 2 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగనున్నారు.

జనవరి 3వ తేదీ ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగించి, పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జనవరి 2, 3వ తేదీలలో ఆర్జిత కల్యాణోత్సవం సేవ రద్దు చేశారు.

భక్తుల సదుపాయం కోసం చలువపందిళ్లు, బారికేడ్లు, క్యూలైన్లు, వాహనాల పార్కింగ్, భక్తులకు సమాచారం తెలిపే ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.