GARUDA VAHANAM ON THIRD DAY IN SKVST_ వైభవంగా ముగిసిన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు
Srinivasa Mangapuram, 30 June 2017: On the final day of the three day Sakshatkara Vaibhavotsavams held at Srinivasa Mangapuram, the processional deity of Lord Sri Kalyana Venkateswara Swamy took celestial ride on Garuda Vahanam on Fridayevening.
Earlier Snapana Tirumanjanam was performed to the deities and in the evening Unjal Seva followed. Later the Lakshmi Kasula Mala was decorated to the deity and taken for a celestial ride on Garuda Vahanam.
Meanwhile the Paruveta Utsavam will be observed on July 1 from 9am to 3pm on Saturday.
Dy EO Sri Venkataiah, AEO Sri Dhanajeyulu, temple staff and large number of devotees took part.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా ముగిసిన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాలు
తిరుపతి, 2017 జూన్ 30: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సాక్షాత్కార వైభవోత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు అభిషేకం జరిగింది. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను కల్యాణమంటపంలోకి వేంచేపు చేసి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు.
సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు స్వామివారి ఊంజల్‌సేవ కన్నుల పండువగా జరిగింది. రాత్రి 7.30 గంటలకు లక్షీహారాన్ని ఆలయ ప్రదక్షిణగా వాహన మండపంలోకి తీసుకొస్తారు. రాత్రి 8.00 నుండి 9.30 గంటల వరకు స్వామివారు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ వేంకటయ్య, ఎఈవో శ్రీ ధనంజయ, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్‌బాబు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీఅనిల్‌కుమార్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
జూలై 1న పార్వేట ఉత్సవం :
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాల మరుసటి రోజైన జూలై 1వ తేదీ శనివారం పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 7.00 గంటలకు ఆలయం నుంచి స్వామివారి ఉత్సవమూర్తులను శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకెళతారు. ఉదయం 9.00 నుండి 3.00 గంటల వరకు ప్రత్యేక ఆస్థానం, పార్వేట ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.