SMART ID CARDS ISSUED TO TTD EMPLOYEES _ టిటిడి ఉద్యోగులకు స్మార్ట్ కార్డులు
Tirupati, 19 Dec. 21: As part of enhanced social welfare measures for TTD employees, the issue of smart cards for 6597 persons was completed on Sunday.
The issue of smart cards comprising of all RFID data was the brainchild of TTD EO Dr Jawahar Reddy and was effectively implemented by the TTD JEO Smt Sada Bhargavi as part of social welfare initiatives.
The RFID of the cards embedded comprehensive service data of employees with a focus on photo ID entry for all TTD offices, pensions, Srivari Darshan, laddu allotment, calendars, dairies and Panchangam and medical benefits to each employee besides family cards for all benefits to the family.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి ఉద్యోగులకు స్మార్ట్ కార్డులు
తిరుపతి, 2021 డిసెంబరు 19: టిటిడి ఉద్యోగుల సంక్షేమ చర్యల్లో భాగంగా అందరికీ స్మార్ట్ కార్డులు జారీ చేయడం జరిగింది. టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు జెఈఓ శ్రీమతి సదా భార్గవి పర్యవేక్షణలో ఈ స్మార్ట్ కార్డుల జారీ పూర్తయ్యింది.
మొత్తం 6,597 మంది ఉద్యోగులకు ఆర్ఎఫ్ఐడి(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) సాంకేతికతో కూడిన స్మార్ట్ కార్డులతో పాటు ఫ్యామిలీ కార్డును అందించడం జరిగింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరిజ్ఞానం ద్వారా ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని ఈ స్మార్ట్ కార్డులో పొందుపరచడం జరిగింది. పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా స్మార్ట్ కార్డు అందజేయడం జరిగింది.
టిటిడి కార్యాలయాల్లోకి ప్రవేశానికి, టిటిడి ఆలయాల్లో దర్శనానికి, ప్రతినెలా లడ్డూలు పొందేందుకు, క్యాలెండర్, పంచాంగం పొందేందుకు, వైద్య వసతులు తదితర సౌకర్యాలు ఈ కార్డు ద్వారా పొందవచ్చు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.