SMS PAY SYSTEM FOR BREAK DARSHAN DEVOTEES _ బ్రేక్ దర్శనం భక్తులకు ఎస్ఎంఎస్ పే సిస్టమ్
– NO NEED TO GO TO MBC – 34
– YOU CAN PAY ONLINE AND TAKE A TICKET PRINT
Tirumala, 06 February 2024: TTD has recently introduced an SMS pay system for the convenience of devotees who are getting VIP Break darshan tickets allotted under the discretionary quota for Tirumala Srivari darshan.
This was implemented from February 1 onwards. In the new system, the pay link will be sent through SMS. Devotees can click on that link and pay online through UPI or Credit Card or Debit Card and take printout of Break Darshan tickets without going to MBC-34 counter.
This procedure is already in vogue for devotees who are getting Sevatickets earned through offline Lucky Dip system in CRO.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
బ్రేక్ దర్శనం భక్తులకు ఎస్ఎంఎస్ పే సిస్టమ్
• ఎంబిసి-34కు వెళ్లాల్సిన అవసరం లేదు
• ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లించి టికెట్ ప్రింట్ తీసుకోవచ్చు
తిరుమల, 2024, ఫిబ్రవరి 06: తిరుమల శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో కేటాయించే బ్రేక్ దర్శనం టికెట్లు పొందే భక్తుల సౌకర్యార్థం టీటీడీ నూతనంగా ఎస్ఎంఎస్ పే సిస్టమ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి ఈ విధానాన్ని అమలుచేస్తోంది.
నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యుపిఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్ లో సొమ్ము చెల్లించి ఎంబీసీ-34 కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బ్రేక్ దర్శన టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పటికే ఆఫ్‌లైన్‌లో సిఆర్ఓలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవాటికెట్లు పొందుతున్న భక్తులకు ఈ విధానం అమలు చేస్తున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.