SMT VEMURI USHA RANI SWORN IN AS TTD BOARD EX-OFFICIO _ టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా రాష్ట్ర దేవాదాయ శాఖ కార్య‌ద‌ర్శి ప్రమాణస్వీకారం

TIRUMALA, 10 Nov. 19: Smt Vemuri Usha Rani, IAS, Secretary to government (Land, Endowments & DM), Govt. of AP, sworn in as the ex-officio member of TTD Board on Sunday.

The TTD Addl Executive officer Sri AV Dharma Reddy administered the oath of office to Smt Vemuri Usha Rani at the Bangaru Vakili of Tirumala temple on Sunday morning. After fulfilling the formalities, Smt Vemuri Usha Rani offered prayers to Lord Venkateswara. Later the vedic pundits offered Veda Asirvachanams inside Ranganayakula Mandapam.

Reception Officials Sri Balaji, Sri Prabhakar Reddy and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా రాష్ట్ర దేవాదాయ శాఖ కార్య‌ద‌ర్శి ప్రమాణస్వీకారం

తిరుమల, 2019  నవంబర్ 10: రాష్ట్ర దేవాదాయ శాఖ కార్య‌ద‌ర్శి శ్రీమతి వేమూరి ఉషా రాణి  ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. టిటిడి అదనపు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి  శ్రీమతి వేమూరి ఉషా రాణితో ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత అదనపు ఈవో  స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని వారికి అందించారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, బోర్డు సెల్‌  ఏఈవో శ్రీమతి సుశీల‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.