SNAPANA TIRUMANJANAM HELD _ శాస్త్రోక్తంగా వైభవోత్సవ మండపంలో శ్రీవారి స్నపన తిరుమంజనం

TIRUMALA, 13 NOVEMBER 2022: Snapana Tirumanjanam was held in Vaibhavotsava Mandapam in Tirumala on Sunday in connection with Karthika Vanabhojanam.

The community dining Karthika Vanabhojanam was supposed to take place at Paruveta Mandapam along with Snapana Tirumanjanam to Utsava Murthies. But due to incessant rains, TTD cancelled Karthika Vanabhojanam.

However, Snapana Tirumanjanam was observed in Vaibhavotsava Mandapam in a grand manner.

Both the seers of Tirumala, TTD officials participated in the sacred event.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శాస్త్రోక్తంగా వైభవోత్సవ మండపంలో శ్రీవారి స్నపన తిరుమంజనం

తిరుమల‌, 2022 నవంబరు 13: కార్తీక వనభోజనం సందర్భంగా ఆదివారం తిరుమలలోని వైభవోత్సవ మండపంలో శాస్త్రోక్తంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు.

ప్రతి ఏడాది కార్తీక మాసంలో పార్వేటి మండపం వద్ద కార్తీక వనభోజనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కార్తీక వనభోజనాన్ని టీటీడీ రద్దు చేసింది.

అయితే వైభవోత్సవ మండపంలో స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనములతో విశేషంగా అభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.