SNAPANAM PERFORMED TO SAHASRA SEERSHA PURUSHA ON DAY ONE OF JYESTABHISHEKAM_ శ్రీవారి ఆలయంలో ఘనంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం

Tirumala, 24 June 2018: As a part of the three day annual Jyestabhishekaam in Tirumala temple, Snapana Tirumanjanam was performed to the processional deities on Sunday.

SIGNIFICANCE: Of the Pancha Beras of Lord Venkateswara, the processional deity of Lord Malayappa Swamy is considered as Utsava Beram. As this idol was found in deep forest of Seshachala ranges, it is also revered as Sri Malaya Kuniya Ninra Perumal as per the available inscription belonging to 1339AD.

RITUAL: After a series of religious events in Yagashala by ritwiks, the deities were brought to Kalyanotsava Mandapam and seated on a special platform. Later amidst the chanting of veda mantras including Pancha suktas, abhishekam was rendered to deities with milk, coconut water, honey, turmeric and sandal paste.

VAJRA KAVACHAM:

Later in the evening, Lord Sri Malayappa Swamy blessed the devotees in Vajra Kavacham on the first day.

TTD has cancelled Arjitha Vasanthotsavam in view of Jyestabhishekaam on Sunday

HH Tirumala Pedda Jiyangar Swamy, HH Tirumala Chinna Jiyar Swamy, chief priests Sri Venugopala Deekshitulu, Sri Govinda Raja Deekshitulu, TTD EO Sri Anil Kumar Singhal, Temple DyEO Sri Harindranath were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఘనంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం

సహస్రశీర్ష పురుషునికి వేడుకగా స్నపనతిరుమంజనం

జూన్‌ 24, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే జ్యేష్టాభిషేకం ఆదివారంనాడు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా ఉదయం ఋత్వికులు యాగశాలలో శాంతిహోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. పురుష సూక్తంలోని మంత్రాల్లో స్వామివారిని ”సహస్రశీర్ష పురుషుడు” అని స్తుతిస్తారు.

కాగా, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్రకవచాన్ని అలంకరిస్తారు. సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు వజ్రకవచంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఇదిలా ఉండగా సోమవారం ముత్యాలకవచంతో, మంగళవారం స్వర్ణకవచంతో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. జ్యేష్ఠాభిషేకం కారణంగా ఆదివారం వసంతోత్సవం ఆర్జితసేవను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ గోవిందరాజ దీక్షితులు, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.