SNAPANAM WITH AMLA STANDS OUT FOR THE DAY _ తెల్ల త‌మ‌ల‌పాకులు, వ‌క్క‌గింజ‌లు, ప‌ట్టువ‌స్త్రాల మాల‌ల‌తో  సిరుల‌త‌ల్లికి స్న‌ప‌న‌తిరుమంజ‌నం

Tiruchanoor, 29 Nov. 19: On the seventh day on Friday,  the Goddess Padmavathi was rendered the celestial snapana tirumanjanam in Sri Krishna Mukha Mandapam. 

During every time when abhishekam is rendered with some sacred ingredient, the Goddess was decked with one garland and like that eight sets of garlands were decorated during the entire rituals. 

On Friday,  the Garlands well knitted out of Amla stood as centre of attraction. Moreover, according to Hindu tradition, Amla are considered to be very auspicious in Karthika month. Apart from Amla, garlands made of white betel leaves, black berries, Tulsi etc.have also been decorated. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

తెల్ల త‌మ‌ల‌పాకులు, వ‌క్క‌గింజ‌లు, ప‌ట్టువ‌స్త్రాల మాల‌ల‌తో  సిరుల‌త‌ల్లికి స్న‌ప‌న‌తిరుమంజ‌నం

తిరుపతి, న‌వంబ‌రు 29, 2019: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శుక్ర‌వారం తెల్ల త‌మ‌ల‌పాకులు, వ‌క్క‌గింజ‌లు, ప‌ట్టువ‌స్త్రాలు తదితర మాల‌ల‌తో సిరుల‌త‌ల్లికి క‌డుర‌మ‌ణీయంగా స్నపనతిరుమంజనం జరిగింది. మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో శ్రీపాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక నిర్వ‌హించారు. శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి పాల్గొన్నారు.

కంకణభట్టర్‌ శ్రీ వేంప‌ల్లి శ్రీ‌నివాసులు ఆధ్వర్యంలో ఈ విశేష కార్య‌క్ర‌మం జరిగింది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం  నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను పాంచరాత్ర ఆగమయుక్తంగా నిర్వహించారు.

 
ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఎనిమిది రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు. ఇందులో తెల్ల త‌మ‌ల‌పాకులు, వ‌క్క‌గింజ‌లు, ప‌ట్టువ‌స్త్రాల మాల‌, తెలుపు అన‌ప‌కాయ‌లు, నెల్లికాయ‌లు, తెలుపు చెర్రీలు, న‌ల్ల ద్రాక్ష‌, చివ‌రిగా తుల‌సి మాల‌ల‌ను అమ్మవారికి అలంకరించారు. మ‌ధ్య‌లో ప‌లుర‌కాల ఫ‌లాల‌ను నివేదించారు. టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు ఆధ్వ‌ర్యంలో మాల‌ల‌ను రూపొందించారు.
       
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.