STEPS TO STALL THEFTS IN TTD REST HOUSES- TTD SO _ తిరుమల వసతి సముదాయాలలో దొంగతనాలను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు: తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి
Tirumala, 3 Sep. 19: TTD special officer of Tirumala Sri AV Dharma Reddy directed officials on Tuesday to take effective measures to contain thefts in the TTD Rest houses.
Addressing TTD senior officials at the Annamaiah Bhavan in Tirumala on Tuesday evening he asked the TTD vigilance and police departments to coordinate efforts to curb the menace of theft cases in TTD Rest houses.
He urged the Tirumala Police to enhance the vigil and also TTD vigilance personnel in the Rest houses to keep a watch after a detailed discussion with the Tirumala DSP Sri Prabhakar on the issue.
He said the initiative to keep senior TTD officials to monitor the TTD Rest houses region wise had yielded good results and also enhanced services to devotees.
In the same manner the campaign against plastics ban should also be taken up in a phased manner and hotel and shop owners be directed to take alternative steps in the place of plastic bottles. The SO also directed officials to spread awareness against plastic use among devotees, shopkeepers and hotel owners as well.
He asked officials to make elaborate arrangements for smooth conduction of Srivari annual Brahmotsavams from September 30- October 8. He wanted all departments to complete preparations by September 20 to provide a comfortable and exhilarating experience to devotees of Brahmotsavam vahana sevas.
TTD Chief Engineer Sri Ramachandra Reddy, Temple DyEO Sri Harindranath, Health Officer Sri RR Reddy, Annapradadam Special Officer Sri Venugopal, VGO Sri Manohar, Transport GM Sri Sesha Reddy and other officials participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమల వసతి సముదాయాలలో దొంగతనాలను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు: తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి
తిరుమల, 2019 సెప్టెంబరు 03: శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు విడిది చేసే వసతి సముదాయాలలో దొంగతనాలను అరికట్టేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ ఇటీవల కాలంలో తిరుమలలోని వసతి సముదాయాలు, అతిధి భవానాలలో దొంగతనాలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టేందుకు టిటిడి విజిలెన్స్ మరియు పోలీస్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇందుకోసం అతిధి భవనాల వద్ద అదనంగా సిసి టివిలు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై తిరుమల డిఎస్పీతో సుదీర్ఘంగా చర్చించారు.
తిరుమలలో ప్రాంతాల వారీగా సీనియర్ అధికారులకు వసతి సముదాయాలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాడం వలన మంచి ఫలితాలు వచ్చాయన్నారు. వసతి గృహలలో భక్తులకు అవసరమైర సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. ఈ సందర్బంగా ఆయన అధికారులను అభినందించారు. అదేవిధంగా తిరుమలలో ప్లాస్టిక్‌ను దశల వారిగా నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా దుకాణదారులు, హోటల్ యజమానులు ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ల వినియోగాన్ని తగ్గించి భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు, దుకాణదారులకు, హోటల్ యజమానులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 30 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు సంతృప్తికరంగా వాహనసేవలను తిలకించేలా టిటిడిలోని అన్ని విభాగాల ఏర్పాట్లు సెప్టెంబరు 20వ తేదీ లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో సిఇ శ్రీ రామచంద్రరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్, ఆరోగ్య విభాగం అధికారి డా..ఆర్.ఆర్ రెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్, విజివో శ్రీ మనోహర్, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి, డిఎస్పీ శ్రీ ప్రభాకర్, ఇతర అధికార ప్రముఖులు ఉన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.