SODASA DINATMAKA ARANYAKANDA CONCLUDES _ ముగిసిన షోడ‌శ‌దినాత్మ‌క‌ అర‌ణ్య‌కాండ దీక్షా

KISHKINDAKANDA PARAYANAM SOON-TTD EO

 

TIRUMALA, 10 JULY 2022: The 16-day Sodasa Dinatmaka Aranyakanda Parayanam concluded at Vasanta Mandapam and in Dharmagiri Veda Vignana Peetham with Maha Purnahuti on Sunday.

 

The Parayanam was carried out under the supervision of Dharmagiri Peetham Principal Sri KSS Avadhani at Vasanta Mandapam while simultaneously with Japa-Tapa-Homa at Dharmagiri with 32 Ritwiks since June 25 till Sunday.

 

Speaking on the occasion, TTD EO Sri AV Dharma Reddy said, the Sodasa Dinatmaka Aranyakanda Parayana Deeksha has received over whelming response from Srivari devotees across the globe.

 

He said TTD has bee doing these Parayana Yagnam from the past two years for the well-being of the entire humanity. “Very soon we will commence Kishkindakanda Parayanam at Nada Neerajanam platform”, he maintained.

 

Earlier briefing about the highlights of the 16-day Parayana Deeksha, Sri KSS Avadhani said, Sri Sita Lakshmana Anjaneya Sameta Sri Rama Moola Mantra was recited 27lakh times during this period.

 

Later Maha Purnahuti was performed between 11am and 12 noon with Sankalpam, Homa Dravya Puja, Bali Pradanam, Dravya Samarpana, Vastortara Homam and Purnahuti rituals.

 

SVBC telecasted the programme live for the sake of global devotees.

 

Earlier at Vasanta Mandapam Dr K Vandana and her team presented “Rama Rama… Samasta Papa Khandanam”, a famous octet penned by Sage Vyasa on Sri Rama in a mellifluous manner which mesmerized the devotees in devotional waves.

 

CEO SVBC Sri Shanmukh Kumar, Vaikhanasa Agama Advisor Sri Mohana Rangacharyulu, VGO Sri Bali Reddy and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సృష్ఠిలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాలి

– వ‌సంత మండ‌పంలో ముగిసిన షోడ‌శ‌దినాత్మ‌క‌ అర‌ణ్య‌కాండ దీక్షా

– త్వ‌ర‌లో కిష్కింద‌కాండ‌ పారాయ‌ణ దీక్ష‌

– టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమ‌ల‌, 2022 జూలై 10: సృష్ఠిలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌లో 16 రోజుల పాటు నిర్వ‌హించిన షోడ‌శ‌దినాత్మ‌క‌ అర‌ణ్య‌కాండ‌ పారాయ‌ణ దీక్ష ఆదివారం మ‌హా పూర్ణాహుతితో ముగిసింద‌ని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. మ‌హాపూర్ణాహుతి కార్య‌క్ర‌మంలో ఈవో దంప‌తులు పాల్గొన్నారు.

తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని ఆధ్వ‌ర్యంలో వ‌సంత మండ‌పంలో అర‌ణ్య‌కాండ‌ పారాయ‌ణంలోని శ్లోకాల పారాయ‌ణం, ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠంలో జ‌ప‌-త‌ర్ప‌ణ-హోమాలు నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్బంగా ఈవో మాట్లాడుతూ లోక సంక్షేమం కోసం శ్రీ‌వారిని ప్రార్థిస్తూ 16 రోజుల పాటు షోడ‌శ‌దినాత్మ‌క‌ అర‌ణ్య‌కాండ పారాయ‌ణ దీక్ష నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. వాల్మీకి మ‌హ‌ర్షి సుంద‌ర‌కాండ‌. బాల‌కాండ, అయోధ్య‌కాండ‌, అర‌ణ్య‌కాండ‌, కిష్కింద‌కాండ‌, యుద్ధ‌కాండ మ‌రియు ఉత్త‌ర‌కాండ‌లుగా రామాయ‌ణాన్ని ర‌చించార‌న్నారు. ఇప్ప‌టికే సుంద‌ర‌కాండ‌. బాల‌కాండ, అయోధ్య‌కాండ‌, యుద్ధ‌కాండ, అర‌ణ్య‌కాండ‌ల‌ను పారాయ‌ణం చేశామ‌న్నారు. పండితుల‌తో చ‌ర్చించి, త్వ‌ర‌లో కిష్కింద‌కాండ పారాయ‌ణ కార్య‌క్ర‌మం ప్రారంభించ‌నున్న‌ట్లు చెప్పారు. ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా భ‌క్తులు ఈ ప‌రాయ‌ణంలోని శ్లోకాల‌ను వీక్షించిన‌, ప‌ఠించిన‌, శ్ర‌వ‌ణం చేసిన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంద‌న్నారు.

ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠంలో :

ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠంలోని ప్రార్థ‌నా మందిరంలో ప్ర‌తి రోజు అర‌ణ్య‌కాండ‌ పారాయ‌ణంలో భాగంగా జ‌ప‌-త‌ర్ప‌ణ-హోమాదులు నిర్వ‌హించారు. లోక క్షేమం కోసం 16 రోజుల పాటు ఉపాస‌కులు అకుంఠిత‌ దీక్ష, శ్ర‌ద్ధ‌ల‌తో శ్రీ సీతాల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ‌స్వామి స‌మేత శ్రీ రామ మూల మంత్రానుష్ఠానం 27 ల‌క్ష‌ల సార్లు జ‌పించారు. జ‌పంలో ప‌ద‌వ వంతు ఆవు పాల‌తో త‌ర్ప‌ణం, త‌ర్ప‌ణంలో 10వ వంతు హోమాలు నిర్వ‌హించారు.

మ‌హా పూర్ణాహూతి సంద‌ర్బంగా ఆదివారం ఉద‌యం మూల మంత్ర హోమాలు, శ్లోక హోమాలు, మండ‌ప దేవ‌త హోమాలు, అంగ హోమాలు, పౌష్ఠిక హోమాలు, శాంతి హోమాలు, జ‌యాతి హోమం, కుంభారాధ‌న జ‌రిగింది. త‌రువాత స‌మ‌స్త దోషాలు తోల‌గి పోవాల‌ని అభిజిత్ ల‌గ్నంలో మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు సంక‌ల్పం, హోమ‌ద్ర‌వ్య పూజ‌, బ‌లి ప్ర‌దానం, ద్ర‌వ్య స‌మ‌ర్ప‌ణ‌, వ‌సోర్ధారా హోమం, పూర్ణాహుతి నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

వ‌సంత మండ‌పంలో :

అంత‌కుముందు తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్టాడుతూ అర‌ణ్య‌కాండలోని 75 స‌ర్గ‌ల్లో 2,454 శ్లోకాలు పారాయ‌ణం చేసిన‌ట్లు తెలిపారు. ఈ శ్లోక‌పారాయ‌ణ ద్వారా రాక్ష‌స గుణాలు తొల‌గిపోయి సాత్విక గుణాలు అల‌వ‌డ‌తాయ‌ని చెప్పారు. ఆదివారం ఉద‌యం 70 నుండి 75వ స‌ర్గ వ‌ర‌కు ఉన్న 188 శ్లోకాల‌ను 16 మంది ఉపాసకులు అత్యంత దీక్షా శ్రద్ధలతో పారాయ‌ణం చేశార‌ని వివ‌రించారు.

టీటీడీ ఎస్వీ సంగీత నృత క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ‌మ‌తి వంద‌న బృందం ” ‌రామ రామ రామ్‌…భ‌జే విశేష సుంద‌రం స‌మ‌స్త పాప ఖండ‌నం …… ” ‌, అనే సంకీర్తనను సుమ‌ధురంగా అల‌పించారు.

ఎస్వీబీసి సిఇవో శ్రీ షణ్ముఖ కుమార్, వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు మరియు ఆస్థాన పండితులు శ్రీ మోహ‌న రంగాచార్యులు, వి జి వో శ్రీ బాలి రెడ్డి, ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం పండితులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.