SODASA VAHANAMS GETS READY FOR “SODASA KALANIDHI” SERVICE_ షోడసకళానిధికి షోడస వాహనసేవలు

“Sodasa Kalanidhiki Sodasopacharamulato
Jaadatoda Nicchalulu Samarpayami”

Tirumala, 12 September 2017: This sankeertan was penned by Padakavita Pitamaha Sri Tallapaka Annamacharya while describing the various sevas that are being rendered to Lord Venkateswara.

Sodasa means sixteen in Sanskrit. The Lord takes celestial ride on sixteen different vahanams during the Navahnika Brahmotsavams. In 2013 TTD has prepared new Golden Chariot for Lord while in the present year the processional deity of Lord Sri Malayappa Swamy will take ride on new Sarvabhupala Vahanam.

Made at a cost of around Rs.8crores, the 1020 kilos mammoth Sarvabhupala Vahanam is prepared which is a constitution of around 8.89kilos of gold used for covering, 355kilos of copper (around 650kilos of wood). The Vahanam is also tested on trial run.

Tirumala Srivari nine-day annual Brahmotsavams will be observed in a big way from September 23rd to October 1st.

The schedule of religious events and Vahana sevas during this annual fete includes Koil Alwar Tirumanjanam on September 19 and Ankurarpanam on 22.

23 September 2017 – Saturday – Dwajarohanam (Flag Hoisting)
– Pedda Sesha Vahanam between 9pm and 11pm

24 September 2017 – Sunday-Morning 9 am – 11am Chinna Sesha Vahanam
Evening 9 pm – 11pm – Hamsa Vahanam

25 September 2017 – Monday-Morning 9 am – 11am-Simha Vahanam
Evening 9 pm -11pm- Muthyala Pandiri Vahanam

26 September 2017 – Tuesday Morning 9 am – 11am Kalpa Vruksha Vahanam
Evening 9 pm – 11pm- Sarva Bhoopala Vahanam

27 September 2017 – Wednesday Morning 9 am – 11am -Mohini Avatharam
7.30 pm to 1 am- Garuda Vahanam

28 September 2017 – Thursday Morning 9 am – 11am-Hanumantha Vahanam
Evening 5 pm – 7pm- Swarna Rathotsavam
Evening 9 pm – 11pm- Gaja Vahanam
29 September 2017 – Friday Morning 9 am – 11am-Surya Prabha Vahanam
Evening 9 pm – 11pm – Chandra Prabha Vahanam

30 September 2017 – Saturday Morning 7am – Rathostavam
Evening 9 pm – 11pm-Ashwa Vahanam

1 October 2017 – Sunday Morning 6 am -9am- Chakra Snanam
Evening -9pm and 10pm- Dwajaavarohanam

Among the 16 vahanams, the Lord along with His two consorts Sri Devi and Bhu Devi will take celestial ride on Peddasesha, Mutyapupandiri, Kalpavriksha, Sarvabhupala, Swarnaratha and Rathotsavams where as solo in other vahanams in various guise and bless the devotees.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

షోడసకళానిధికి షోడస వాహనసేవలు

”షోడసకళానిధికి షోడసోపచారములు

జాడతోడ నిచ్చలును సమర్పయామి”

సెప్టెంబర్‌ 12, తిరుమల 2017: అని పదకవితా పితమహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు తిరుమల శ్రీవారి వివిధ ఉత్సవ వైభవాలను హృద్యంగా తమ సంకీర్తనలో వివరించారు.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మూెత్సవాలు ఈ నెల 23 నుండి అక్టోబరు 1 వరకు జరుగనున్న నేపథ్యంలో శ్రీవారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్పస్వామివారు 16 దివ్యవాహనాలపైన తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

స్వామివారికి నూతన సర్వభూపాల వాహన సేవ

కాగా 2013వ సంవత్సరంలో నూతన స్వర్ణరథంపై భక్తులను కనువిందుచేసిన స్వామివారు ఈ ఏడాది బ్రహ్మూెత్సవాలలో శ్రీ మలయప్పస్వామి నూతన సర్వభూపాల వాహనంపై భక్తులను అలరించనున్నారు. కాగా దాదాపు రూ. 8 కోట్లతో 1020 కిలోల బరువు కలిగిన ఈ వాహనంలో 8.89 కిలోల బంగారం 355 కిలోల రాగి (చెక్క బరువు 655 కిలోలు) ఉపయోగించారు. ఇప్పటికే ఈ సర్వభూపాల వాహనాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు.

బ్రహ్మూెత్సవ విశేష కార్యక్రమ మరియు వాహన సేవ వివరాలు

శ్రీవారి నవాహ్నిక వార్షిక బ్రహ్మూెత్సవాలకు సంబంధించి ఈ నెల 19వ తారీఖున కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 22న అంకురార్పణంతో ప్రారంభం కానున్న బ్రహ్మూెత్సవ వాహన సేవల వివరాలు.

సెప్టెంబరు 23 ధ్వజారోహణం (మీనలగ్నం సా. 5.48 నుండి సా. 6.00 వరకు) పెద్దశేషవాహనం – రాత్రి 9.00 నుండి రాత్రి 11.00 వరకు

సెప్టెంబరు 24 చిన్న శేషవాహనం- ఉ. 9.00 నుండి ఉ. 11.00 వరకు హంసవాహనం – రాత్రి 9.00 నుండి రాత్రి 11.00 వరకు

సెప్టెంబరు 25 సింహవాహనం – ఉ. 9.00 నుండి ఉ. 11.00 వరకు ముత్యపుపందిరి – రాత్రి 9.00 నుండి రాత్రి 11.00 వరకు

సెప్టెంబరు 26 కలపవృక్ష వాహనం – ఉ. 9.00 నుండి ఉ. 11.00 వరకు సర్వబూపాలవాహనం – రాత్రి 9.00 నుండి రాత్రి 11.00 వరకు

సెప్టెంబరు 27 మోహినీఅవతారం – ఉ. 9.00 నుండి ఉ. 11.00 వరకు గరుడవాహనం – రాత్రి 7.30 నుండి ఉ. 1.00 వరకు

సెప్టెంబరు 28 హనుమంత వాహనం – ఉ. 9.00 నుండి ఉ. 11.00 వరకు రథరంగ డోలోత్సవం – సా. 5.00 నుండి సా. 7.00 వరకు గజవాహనం – రాత్రి 9.00 నుండి రాత్రి 11.00 వరకు

సెప్టెంబరు 29 సూర్యప్రభ వాహనం – ఉ. 9.00 నుండి ఉ. 11.00 వరకు చంద్రప్రభ వాహనం – రాత్రి 9.00 నుండి రాత్రి 11.00 వరకు

సెప్టెంబరు 30 రోథోత్సవం – ఉ. 7.00 లకు అశ్వ వాహనం – రాత్రి 9.00 నుండి రాత్రి 11.00 వరకు

అక్టోబరు 1 చక్రస్నానం – ఉ. 6.00 నుండి ఉ. 9.00 వరకు ధ్వజావరోహణం – రాత్రి 9.00 నుండి రాత్రి 10.00 వరకు

కాగా ఈ వాహనసేవల్లో స్వామివారు తన ఉభయదేవేరులతో కూడి పెద్దశేషవాహనం, ముత్యపుపల్లకి, కల్పవృక్ష, సర్వభూపాల, స్వర్ణరథ మరియు రథోత్సవాలలో భక్తులను అలరిస్తే చిన్నశేష, హంస, సింహ, గరుడ, హనుమంత, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ మరియు అశ్వవాహనాలపై వివిధ రూపాలలో శ్రీ మలయప్ప భక్తులను అలరిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.