SOMA SKANDA MURTY ON KALPAVRIKSHA VAHANAM _ కల్పవృక్ష వాహనంపై సోమస్కందమూర్తి

Tirupati, 28 Feb. 22: As part of the ongoing annual brahmotsavam at Sri Kapileswara Swamy temple in Tirupati, Kalpavriksha vahanam was observed in Ekantam due to COVID-19 restrictions on Monday.

Sri Somaskanda Murty blessed devotees on the Kalpavriksha vahanam.

DyEO Sri Subramanyam, AEO Sri Satre Naik, Superintendent Sri Bhupati, Temple Inspector Sri Reddy Sekhar were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కల్పవృక్ష వాహనంపై సోమస్కందమూర్తి

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 28: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమ‌వారం ఉదయం శ్రీ సోమస్కంధమూర్తి కల్పవృక్ష వాహనంపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహన సేవ ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

అనంతరం ఉదయం 9 నుండి 10 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.

రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వ‌వాహ‌నంపై స్వామివారికి ఆస్థానం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ స‌త్రేనాయ‌క్ నాయక్, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.