SOMASKANDA MURTHY ON THE GAJA VAHANAM _ గ‌జ‌ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి

Tirupati, 06 March 2024: Sri Somaskandamurthy blessed the devotees on the Gaja Vahanam on the sixth evening of the ongoing annual Brahmotsavam of Sri Kapileswara Swamy in Tirupati on Wednesday. 

The Vahana seva started from the temple and returned while parading the streets covering Kapilatheertham Road, Anna Rao Circle, Vinayaka Nagar Quarters, Harerama Harekrishna temple, NGOs Colony, Alipiri Bypass Road. 

Temple Deputy EO Sri Devendra Babu, AEO Sri Subbaraju, Superintendent Sri Bhupathi, Temple Inspectors Sri Ravikumar, Sri Balakrishna and devotees participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

గ‌జ‌ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి

తిరుప‌తి, 2024, మార్చి 06: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధ‌వారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి గజ వాహనంపై అనుగ్రహించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

ఆద్యంతరహితుడైన శివదేవుడు, ఐశ్వర్యసూచికమైన గజవాహనాన్ని అధిష్టించినపుడు దర్శనం చేసుకోవడం భ‌క్తుల పుణ్యం.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.