SOMASKANDA ON TIRUCHI _ తిరుచ్చిపై సోమస్కందమూర్తి
TIRUPATI, 19 FEBRUARY 2023: Sri Somaskanda Murty along with Sri Kamakshi Devi took out a celestial ride on Tiruchi on Sunday evening.
The procession was led by colourful bhajans, kolatams, paraphernalia along the streets.
Deputy EO Sri Devendra Babu, Superintendent Sri Bhupati Raju and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
తిరుచ్చిపై సోమస్కందమూర్తి
తిరుపతి, 19 ఫిబ్రవరి 2023: తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజైన ఆదివారం రాత్రి శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కంధమూర్తి తిరుచ్చిపై అనుగ్రహించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు.
మహాదేవుడైన కపిలేశ్వరస్వామిని బ్రహ్మోత్సవ వేళ ఈ తిరుచ్చి వాహనంపై దర్శించే భక్తుల కోరికలు నెరవేరతాయని ఐతిహ్యం.
కాగా, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. విశేషంగా భక్తులు పాల్గొన్నారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్తులకు లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను రష్యా నుండి వచ్చిన విదేశీ భక్తులు ఆద్యంతం తిలకించి ఆనందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారధి, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.