SOMASKANDAMURTY RIDES ON FLOAT _ తెప్పలపై శ్రీ సోమస్కందస్వామివారి కటాక్షం
Tirupati, 7 January 2020: On the third day evening, the utsava deity of Sri Somaskandamurty took celestial ride on finely decked float in Sri Kapileswara Swamy temple on Tuesday evening.
The fete took place between 6:30pm and 7:30pm.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
తెప్పలపై శ్రీ సోమస్కందస్వామివారి కటాక్షం
తిరుపతి, 07 జనవరి 2020: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో మూడోరోజైన మంగళవారం సాయంత్రం శ్రీ సోమస్కందస్వామివారు తెప్పలపై భక్తులను కటాక్షించారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు స్వామివారు ఐదు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు.
అదేవిధంగా బుధవారం శ్రీ కామాక్షి అమ్మవారు తెప్పలపై ఏడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.