SOME IMPORTANT RESOLUTIONS OF TTD TRUST BOARD MEETING _ తి.తి.దే పాలకమండలి  సమావేశంలోని పలు కీలక నిర్ణయాలు

TIRUMALA, JAN 21: The TTD Board meeting which held at Annamaiah Bhavan in Tirumala on Monday under the chairmanship of Sri K Bapiraju in Tirumala has taken some important decisions. TTD board members, Endowments Principal Secretary Sri MG Gopal, Endowments Commissioner Sri G Balaramaiah, TTD EO and ex-officio member Sri LV Subramanyam, JEOs Sri KS Sreenivasa Raju, Sri P Venkatrami Reddy, CVSO Sri GVG Ashok Kumar were also present. Some excerpts:
 
1. The TTD board has taken a decision to pay exgratia upto Rs.1lakh to those pilgrims who die suddenly while trekking the Alipiri and Srivari Footpath routes due to health reasons(in the case of natural death alone). (However, TTD has been appealing to the devotees who are suffering from chronic heart diseases, BP and diabetes not to trek the footpath routes and instead chose alternate darshan).
 
2. The board has given approved Rs.11cr towards the construction of Srivari temple at Brahmasagar in Kurkshetra which will be completed in a period of one year.
 
3. The board has given nod to purchase two crore laddu covers at an estimated cost of Rs.2.42crores with each cover approximately charging around 1Re 21Ps.
 
4. The board has given TTDs land of 41.68sq m to Hanuman Temple trust in Chikedapally on free of cost to perform religious and dharmic activities and  Similarly TTD Kalyana Mandapam to local lord Venkateswara Swamy temple in Vanaparty in Mahaboobnagar district. However the property rights lies with TTD only.
 
5. The board has decided to take over the Srivari temple in Chandigarh.
 
6. TTD’s religious activities will commence in Kumbhamela on January 26 with the opening of Tirumala look alike temple at 10.30am being set up by TTD in Kumbhmela ghat in Sector 6. All the rituals which are being performed to lord Venkateswara will be performed here.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 
తి.తి.దే పాలకమండలి  సమావేశంలోని పలు కీలక నిర్ణయాలు

తిరుమల, 21 జనవరి 2013: తి.తి.దే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు నేతృత్వంలో తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారంనాడు పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు, ఎక్స్‌ అఫిషియో సభ్యులైన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి శ్రీ ఎం.జి.గోపాల్‌, దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ బలరామయ్య, తి.తి.దే ఇ.ఓ శ్రీ ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, జె.ఇ.ఓలు శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.
పాలకమండలి సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు
1. తిరుమల శ్రీవారి దర్శనార్థం అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాల్లో వచ్చే భక్తులు అనారోగ్య కారణాలతో సహజ మరణం పొందితే రూ.లక్ష వరకు ఎక్స్‌గ్రేషియా.
2. హైదరాబాద్‌ చిక్కడపల్లి ప్రాంతంలోని 41.68 చదరపు మీటర్ల స్థలాన్ని ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం దేవాదాయ శాఖ పరిధిలోని శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం ట్రస్టుకు అప్పగింత.
3. మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిలో గల తితిదే కల్యాణమండపాన్ని ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం స్థానికంగా గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి అప్పగింత.
4. కేంద్ర రైల్వే మంత్రి శ్రీ పవన్‌కుమార్‌ బన్సాల్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న చంఢీఘడ్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని తితిదే ఆధీనంలోకి తీసుకునేందుకు నిర్ణయం.
5. కురుక్షేత్రలోని బ్రహ్మసాగర్‌ ప్రాంతంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.11 కోట్లతో టెండర్‌ ఆహ్వానం. ఈ ఆలయ నిర్మాణానికి స్థానిక ఎంపీ శ్రీ నవీన్‌జిందాల్‌ రూ.కోటి విరాళం.
6. దేవాదాయ శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా గల ఆలయాల పాలకమండళ్లు ఆసక్తి కనబరిస్తే ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం తితిదే కల్యాణమండపాలు అప్పగించేందుకు నిర్ణయం.
7. 2 కోట్ల లడ్డూ కవర్లను కొనుగోలు చేసేందుకు రూ.2.42 కోట్లు విడుదల. థలవారీగా బయోడిగ్రేడబుల్‌ సంచుల వాడకానికి ప్రయత్నం.
8. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఆలహాబాదులో జరుగుతున్న మహాకుంభమేళాలో తితిదే ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో జనవరి 26వ తేదీ ఉదయం 10.00 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభం. ఇందుకోసం 140 మంది ఉద్యోగులు రెండు విడతలుగా వెళ్లనున్నారు. మొదటి విడత ఉద్యోగుల బృందం జనవరి 22వ తేదీన, రెండో విడత ఉద్యోగుల బృందం ఫిబ్రవరి 14వ తేదీన ఆలహాబాదుకు వెళ్లనున్నాయి. ఇక్కడ భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందించేందుకు తితిదే నిర్ణయం. ఇందుకోసం దాతల నుండి  విరాళాలు ఆహ్వానం. ఈ సందర్భంగా కుంభమేళాలో భక్తులకు సేవలందించేందుకు ఉత్తరాదిలోని శ్రీవారి సేవకులకు తితిదే ఈవో ఆహ్వానం.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.