SOMESWARA SWAMY TEMPLE JEERNODHARANA FETE HELD _ శాస్త్రోక్తంగా భానుకోట శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు భూమి పూజ

YSR KADAPA, 04 JULY 2021: Bhoomi Puja was held for Bhanukota Sri Someswara Swamy temple located in Simhadripuram Mandal at YSR Kadapa district was held on Sunday with spiritual ecstasy for taking up renovation works.

The Honourable Minister of AP Endowments Sri V Srinivasa Rao along with TTD EO and Specified Authority Chairman Dr KS Jawahar Reddy took part in this Jeernodharana program.

Later speaking to media, the Endowments Minister said that the state government is striving a lot to safe guard the endowments land. “We will not allow even a cent of endowments land to get encroached”, he asserted. He said State Government is taking special care of all the renovated ancient temples which are priceless treasures of our rich culture and heritage he added.

The development works which are taken up at Rs. 3.54crore includes the construction of Thritala Rajagopuram, reconstructions of Sivalayam, Ammavari temple, Mukha Mandapam, providing Dhwajasthambham, construction of Vinayaka Swamy temple and stone Prakaram.

The puja event was also graced by the Honourable MP Sri Avinash Reddy, MLC Sri B Tech Ravi, YSR Kadapa district collector Sri Harikiran, JC Smt Goutami, CE Sri Nageswara Rao, SE Sri Jagadeeshwar Reddy, DyEO Sri Ramana Prasad, PADA OSD Sri Anil Kumar Reddy and others.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శాస్త్రోక్తంగా భానుకోట శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు భూమి పూజ

– టిటిడి ఆధ్వర్యంలో రూ.3.54 కోట్లతో అభివృద్ధి పనులు

– ఏడాదిలో పనులు పూర్తి చేస్తామన్న ఈవో

తిరుపతి 2021 జూలై 04: వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం అహోబిలాపురం గ్రామంలోని భానుకోట శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి శ్రీ వెలం పల్లి శ్రీనివాస్, టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం భూమి పూజ శాస్త్రోక్తంగా జరిగింది.

గణపతి పూజతో ఈ కార్యక్రమాలు ప్రారంభించి వాస్తుహోమం, నవగ్రహ ఆరాధన, నవరత్న స్థాపన, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు అర్చన, నైవేద్యం, హారతి సమర్పించారు.

ఈ ఆలయంలో రూ.3.54 కోట్ల వ్యయంతో టిటిడి అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో త్రితల రాజగోపుర నిర్మాణం, శివాలయం, అమ్మవారి ఆలయం, ముఖమండపం పునర్నిర్మాణం, ధ్వజస్తంభం, బలిపీఠం ఏర్పాటు, వినాయక స్వామివారి ఆలయ నిర్మాణం, ఆలయ ప్రాకారం నిర్మాణం తదితర పనులు ఉన్నాయి.

ఒక్క సెంటు భూమి అన్యాక్రాంతం కానివ్వం : దేవాదాయశాఖ మంత్రి
రాష్ట్రంలో దేవాదాయ శాఖకు చెందిన ఒక్క సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వమని దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెలం పల్లి శ్రీనివాస్ చెప్పారు. సోమేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శంకుస్థాపన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆలయాలకు చెందిన భూముల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. మరమ్మత్తులకు గురైన ఆలయాల జీర్ణోద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎంపి శ్రీ ఆవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ బిటెక్ రవి, జిల్లా కలెక్టర్ శ్రీ హరి కిరణ్, జాయింట్ కలెక్టర్ శ్రీమతి గౌతమి, రావుల కొలను సర్పంచ్ శ్రీ మహేశ్వర రెడ్డి,టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ ఈ శ్రీ జగదీశ్వర రెడ్డి, డిప్యూటి ఈవో శ్రీ రమణ ప్రసాద్, పడ ఓఎస్డీ శ్రీ అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.