SOUBHAGYAM AT SRI PAT _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా ”సౌభాగ్యం”

Tiruchanoor, 26 Nov. 19: TTD has been organizing Soubagyam event in a grand manner during the ongoing Sri Padmavathi Ammavari Brahmotsavams at Tiruchanoor.

As a part of the event, nearly two lakh bangles, kumkum packets and books  are being distributed to women devotees twice in a day betwen 9am and 12noon and again from 3pm till 5pm during the nine day Brahmotsavams.

Since 2012 the event was organised by the HDPP during Varalakshmi Vratam to highlight the significance of Sindhuram and turmeric to the married women and youth in the modern society.

The books comprised of Govinda Namas, Astottaram, Suprabatham, Sri Padmavathi Namavali, Mahalakshmi Mantram etc.

TTDs HDPP chief Acharya Rajagopalan, AEO Sri Nageswar Rao, superintendent Sri Gurunatham, project officer Sri Hemantha Kumar are supervising the distribution work.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI 

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా ”సౌభాగ్యం”

మ‌హిళ‌ల‌కు గాజులు, కుంకుమ పంపిణీ

ఉచితంగా పుస్త‌క ప్ర‌సాదం

తిరుపతి, 2019 న‌వంబ‌రు 26: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా సౌభాగ్యం కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రుగుతోంది. ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 3 నుండి 5 గంట‌ల వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు గాజులు, కుంకుమ అందిస్తున్నారు. బ్ర‌హ్మోత్స‌వాల‌ తొమ్మిది రోజుల్లో 2 ల‌క్ష‌ల గాజులు అందిస్తారు.

తిరుచానూరులో ప్రకాశిస్తున్న శ్రీ పద్మావతి అమ్మవారు సకల సౌభాగ్యాలను ప్రసాదించే శ్రీమహాలక్ష్మీదేవి. స్వామివారు జగద్భర్త కాగా అమ్మ‌వారు లోకమాత. జగత్తు అంతా వారి కుటుంబమే. లోకంలో సిరిసంపదలు, విద్య, పదవి, జ్ఞానం చివరికి మోక్షం కూడా అమ్మవారి స్వరూపాలే అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. జగదేకమాత శ్రీమహాలక్ష్మీ అవతారమైన పద్మావతీ అమ్మవారు అందరికన్నా పెద్ద ముత్తయిదువ. పసుపు, కుంకుమ, కాటుక, గాజులు, కమ్మలను సుమంగళీద్రవ్యాలుగా పెద్దలు చెబుతారు. ఆధునిక స‌మాజంలో ప‌సుపు, కుంకుమ‌ల విలువ‌ను మ‌రిచిపోతున్న యువ‌తుల‌కు వాటి ప్రాధాన్యాన్ని తెలియ‌జేసేందుకు టిటిడి హిందూ ధ‌ర్మప్ర‌చార ప‌రిష‌త్ సౌభాగ్యం కార్య‌క్ర‌మాన్ని రూపొందించింది.

టిటిడి హిందూ ధ‌ర్మప్ర‌చార ప‌రిష‌త్ 2012వ సంవ‌త్స‌రంలో సౌభాగ్యం కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. అప్ప‌టినుండి ప్ర‌తి ఏడాదీ అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు, వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది.

పుస్త‌క ప్ర‌సాదం పంపిణీ

బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు టిటిడి హిందూ ధ‌ర్మప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో ఉచితంగా పుస్త‌క ప్ర‌సాదం పంపిణీ చేస్తున్నారు. వీటిలో గోవింద‌నామాలు, అమ్మ‌వారి అష్టోత్త‌రం, సుప్ర‌భాతం, శ్రీ ప‌ద్మావ‌తి చ‌తుర్వింశ‌తి నామావ‌ళి, సుప్ర‌భాతం, మ‌హాల‌క్ష్మి మంత్రం త‌దిత‌ర పుస్త‌కాలున్నాయి.

టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, ఏఈవో శ్రీ నాగేశ్వ‌ర‌రావు, సూప‌రింటెండెంట్ శ్రీ గురునాథం, లెక్చ‌ర‌ర్ శ్రీ హేమంత్‌కుమార్ ఈ కార్య‌క్ర‌మాల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.