SOUTH INDIA MUSIC AND DANCE FESTIVAL BY TTD FROM FEB 14-16 _ ఫిబ్రవరి 14 నుండి 16 వరకు మహతిలో దక్షిణ భారత సంగీత నృత్యోత్సవం

TIRUPATI, 12 FEBRUARY 2024: The three-day South India Music and Dance festival will be organised by the TTD-run SV College of Music and Dance and SV Nadaswaram and Dolu School in the Mahati Auditorium between February 14 and 16.

The programme will be inaugurated on February 14 at 10am to which Shakti Peethadeeshwari Mata Ramyananda Bharati graces and Valedictory session is on February 16 at 6:45pm.

Prominent artists from various fields of fine arts including Padmasri Dr Yella Venkateswara Rao, Sri Pasumarti Ramalinga Sastry and other stalwarts will grace the three-day event and render lectures while the students are set to allure the audience with their great performances.

Dance ballets like Sri Krishna Leela Vilasam, Sri Rama Kathasaram, Bhakta Prahlada Yaksha Ganam etc. will be showcased on the occasion. Retired Principals of the College will also be felicitated on the occasion as a token of their contributions during their tenure.

TTD Chairman Sri Bhumana Karunakara Reddy, EO Sri AV Dharma Reddy, JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore and other officials will participate.

DEO Dr M Bhaskar Reddy, Principal Dr Uma Muddubala, are supervising the arrangements.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఫిబ్రవరి 14 నుండి 16 వరకు మహతిలో దక్షిణ భారత సంగీత నృత్యోత్సవం

తిరుప‌తి, 2024, ఫిబ్ర‌వ‌రి 12: శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 నుంచి 16వ తేదీ వరకు తిరుపతి మహతి కళామందిరంలో కళావైభవం పేరిట దక్షిణ భారత సంగీత నృత్యోత్సవం నిర్వహించనున్నారు.

ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీ శక్తి పీఠాదీశ్వరి మాతా రమ్యానంద భారతి ఆశీస్సులతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 16న సాయంత్రం 6.45 గంటలకు ముగియనుంది.

పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు, శ్రీ పసుమర్తి రామలింగ శాస్త్రి తదితర ప్రముఖ కళాకారులు ఉపన్యసిస్తారు. పలు రాష్ట్రాల విద్యార్థులు సంగీత, వాద్య, నృత్య ప్రదర్శనలతో అలరించనున్నారు.

ఈ సందర్భంగా శ్రీకృష్ణ లీలావిలాసం, శ్రీరామ కథాసారం, భక్త ప్రహ్లాద యక్షగానం తదితర నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు. పూర్వ ప్రిన్సిపాళ్లను, అధ్యాపకులను సన్మానిస్తారు.

డీఈవో డాక్టర్ ఎం భాస్కర్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీమతి ఉమా ముద్దుబాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.