“SPEAKING BOOKS” TO GIVE SPIRITUAL THRILL TO BLIND AND AGED _ టిటిడి ఛైర్మ‌న్ చేతుల‌మీదుగా స్పీకింగ్ బుక్స్ ఆవిష్క‌ర‌ణ‌

Tirumala, 19 Nov. 20: The first of its kind in the world Speaking Books, in Sampoorna Hanuman Chalisa and Bhagavat Gita were released by TTD Chairman Sri YV Subba Reddy in his Camp Office at Tirumala.

Speaking Books! Sounds something interesting. Yes, these innovative books by Hoyoma Company of New Delhi is being marketed by Safe Shop helps the visionless, uneducated and aged persons to go through the spiritual texts easily. 

According to the makers and marketers, the book consists of a mobile shape electronic reader which when flashed on any page, emitted shlokas and narrative  in audio format. 

As of now the Bhagavadgita audio is available in Hindi, English and Sanskrit voice while Hanuman Chalisa in Telugu, Hindi, English, Assam, Nepali,Tamil, and Malayalam languages. Readers can choose the language of their choice to in the electronic reader.

Sri Murali, Sri Rakesh, Smt Lahari and Sri Sai representing the Safe Shop were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

టిటిడి ఛైర్మ‌న్ చేతుల‌మీదుగా స్పీకింగ్ బుక్స్ ఆవిష్క‌ర‌ణ‌

తిరుమల‌, 2020 నవంబరు 19: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి గురువారం తిరుమ‌ల‌లోని త‌మ కార్యాల‌యంలో స్పీకింగ్ బుక్స్  అయిన‌ భ‌గ‌వ‌ద్గీత‌, సంపూర్ణ హ‌నుమాన్ ఛాలిసా పుస్త‌కాల‌ను ఆవిష్క‌రించారు. చూపు లేని వారి‌తో పాటు చ‌దువురాని వారు, వ‌య‌సు పైబ‌డిన వారు సులభంగా ఇందులోని విష‌యాల‌ను తెలుసుకునే అవ‌కాశ‌ముంది.

ఈ పుస్త‌కాలతోపాటు సెల్‌ఫోన్ లాంటి ఒక ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రం ఉంటుంది. ఈ ప‌రిక‌రాన్ని ఈ పుస్త‌కాల్లోని పేజీల్లో గ‌ల అక్ష‌రాల‌పై పెడితే ఆడియో రూపంలో శ్లోకాలు, తాత్ప‌ర్యాలు వినిపిస్తాయి. భ‌గ‌వ‌ద్గీత హిందీ, ఇంగ్లీషు, సంస్కృతంలో ఉండ‌గా,  సంపూర్ణ హ‌నుమాన్ ఛాలిసా పుస్త‌కం తెలుగు, హిందీ, ఇంగ్లీషు, అస్సామీ, నేపాలీ, త‌మిళం, మ‌ల‌‌యాళం భాషల్లో ఆడియో వినిపిస్తుంది. న‌చ్చిన భాష‌ను ఎంపిక చేసుకుని ఆ భాష‌లో ఈ పుస్త‌కాల్లోని విష‌యాల‌ను తెలుసుకోవ‌చ్చు. న్యూఢిల్లీకి చెందిన హ‌యోమా సంస్థ ఈ పుస్త‌కాల‌ను రూపొందించ‌గా, సేఫ్ షాప్ ఆన్‌లైన్ సంస్థ వీటిని మార్కెటింగ్ చేస్తోంది. ఇలాంటి స్పీకింగ్ బుక్స్ రూపొందించ‌డం ప్ర‌పంచంలోనే మొద‌టిసారి అని సేఫ్ షాప్ సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు.

పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో సేఫ్ షాప్ సంస్థ ప్ర‌తినిధులు శ్రీ ముర‌ళీ, శ్రీ రాకేష్‌, శ్రీ‌మ‌తి ల‌హ‌రి, శ్రీ సాయి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.