SPECIAL ABHISHEKAM PERFORMED_ శ్రీ బేడీ ఆంజనేయస్వామివారికి వేడుక‌గా ప్రత్యేక అభిషేకం

Tirumala, 9 Dec. 18: On the occasion of last Sunday in Karthika month, special abhishekam was performed to Sri Bedi Anjaneya Swamy in Tirumala.

Temple DyEO Sri Harindranath, Peishkar Sri Ramesh were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ బేడీ ఆంజనేయస్వామివారికి వేడుక‌గా ప్రత్యేక అభిషేకం

డిసెంబరు 09, తిరుమ‌ల‌, 2018: తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా గల శ్రీ బేడీ ఆంజనేయస్వామివారికి ఆదివారం ఉదయం వేడుక‌గా ప్రత్యేక అభిషేకం నిర్వ‌హించారు. ప్రతి ఏడాదీ కార్తీక మాసం చివరి ఆదివారం ఇక్కడ స్వామివారికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆల‌యాన్ని పూల‌మాల‌ల‌తో అలంక‌రించారు. అనంత‌రం సుగంధ ప‌రిమ‌ళ ద్ర‌వ్యాల‌తో స్వామివారికి అభిషేకం చేప‌ట్టారు.

పురాణాల ప్రకారం తిరుమలలోని శ్రీ బేడీ ఆంజనేయస్వామివారి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అంజనీపుత్రుడైన ఆంజనేయుడు ఎంతో బలవంతుడు, అంతకుమించి పరమభక్తుడు. త్రేతాయుగంలో శ్రీరామావతారంలో శ్రీమన్నారాయణునికి సేవకుడిగా, స్నేహితుడిగా, భక్తుడికి దాస్యభక్తిని చాటాడు. ప్రస్తుతం కలియుగంలో సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో భక్తుల పూజలందుకుంటున్నాడు.

ఈ కార్యక్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్రనాథ్‌, పేష్కార్ శ్రీ ర‌మేష్‌బాబు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.