SPECIAL CS TAKES OATH AS TTD EX-OFFICIO MEMBER _ టీటీడీ ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా శ్రీకరికాలవలవన్ ప్రమాణస్వీకారం

Tirumala,01 August 2023:  The Special Chief Secretary to Government (Endowments) Sri Karikal Valavan was sworn in as an ex-officio member of the TTD Trust board at Srivari temple in Tirumala on Tuesday.

He was administered the oath of office by TTD EO Sri AV Dharma Reddy in the presence of Srivaru. Thereafter he was presented with Srivari Thirtham, Prasadam and Veda Pundits served Veda Ashirvachanam at Ranganayakula Mandapam by the TTD EO.

Speaking to media persons outside the temple later he said he is thankful to the Honourable Chief Minister of Andhra Pradesh Sri YS Jaganmohan Reddy for the opportunity to serve the devotees of the Universal Supremo.

He said he would strive to further improve the devotee-friendly facilities at Tirumala in addition to the existing infrastructure with the cooperation of the TTD board and officials with the blessings of Sri Venkateswara Swamy.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా శ్రీకరికాలవలవన్ ప్రమాణస్వీకారం

తిరుమల, 2023 ఆగస్టు 01: రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ కరికాలవలవన్ మంగళవారం తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఆయ‌న‌ చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అనంత‌రం వేద‌పండితులు తీర్థ ప్రసాదాలు అందించి ,వేదాశీర్వ‌చ‌నం అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా ఆలయం వెలుపల శ్రీ కరికాలవలవన్ మీడియాతో మాట్లాడారు. తనకు ఈ అవకాశం కల్పించిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి , ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమలలో భక్తులకు ఇప్పటికే మెరుగైన వసతులు ఉన్నాయని చెప్పారు . స్వామివారి ఆశీస్సులు, బోర్డు, అధికారుల సహకారంతో భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.