SPECIAL FESTIVALS AT SRI PADMAVATHI AMMAVARI TEMPLE IN JANUARY _ జనవరిలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tirumala, 29 December 2025: The details of the special festivals to be held in the month of January at Sri Padmavathi Ammavari Temple in Tiruchanoor are as follows:
At Sri Balarama Krishna Swamy Temple…
• On January 1st and 28th, on the occasion of Rohini Nakshatra, the Tiruchi Utsavam for Sri Krishna Swamy will be held at 7 PM.
• On January 2nd, 9th, 16th, 23rd, and 30th, on the occasion of Friday, the Tiruchi Utsavam will be held at 6 PM.
• On January 10th, on the occasion of Hasta Nakshatra, and on January 15th, on the occasion of Sankranthi, Sri Suryanarayana Swamy will give darshan to devotees on the Tiruchi Vahanam at 5 PM.
• On January 19th, on the occasion of Uttarashada Nakshatra, Sri Padmavathi Ammavari will bless the devotees on the Gaja Vahanam (elephant vehicle) at 6:45 PM.
• On January 25th, on the occasion of Ratha Saptami, the Goddess will give darshan on seven different vehicles from 7 AM to 9:30 PM.
• On January 25th, on the occasion of Ratha Saptami, Sri Suryanarayana Swamy will bless the devotees on the Ashwa Vahanam (horse vehicle) at 6 AM. – On January 24th, on the occasion of the Uttarabhadra Nakshatra, Sri Sundararaja Swamy will bless the devotees at 6 PM on the Tiruchi Vahanam (processional vehicle)
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
జనవరిలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2025 డిసెంబరు 29: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి నెలలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీ బలరామకృష్ణ స్వామి ఆలయంలో..
– జనవరి 1 మరియు 28వ తేదీలలో రోహిణి నక్షత్రం సందర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి రాత్రి 7 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది.
– జనవరి 2, 9, 16, 23, 30వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
– జనవరి 10న హస్తా నక్షత్రం మరియు జనవరి 15న సంక్రాంతి సందర్భంగా శ్రీ సూర్యనారాయణస్వామి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.
– జనవరి 19న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా శ్రీపద్మావతి అమ్మవారు సాయంత్రం 6.45 గంటలకు గజ వాహనంపై భక్తులను కటాక్షిస్తారు.
– జనవరి 25న రథ సప్తమి సందర్భంగా అమ్మవారు ఉదయం 7 నుండి రాత్రి 9.30 గంటల వరకు ఏడు వాహనాలపై దర్శనమిస్తారు.
– జనవరి 25న రథ సప్తమి సందర్భంగా శ్రీ సూర్యనారాయణస్వామి ఉదయం 6 గంటలకు అశ్వ వాహనంపై భక్తులను కటాక్షిస్తారు.
• జనవరి 24న ఉత్తరాభాద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ సుందరాజస్వామివారు సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి వాహనంపై భక్తులను అనుగ్రహిస్తారు.
