SPECIAL PUJAS AT SRINIVASA MANGAPURAM FOR VAIKUNTA EKADASI CELEBRATIONS _ డిసెంబరు 23న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు
Tirupati,18 December 2023: In connection with the Vaikunta Ekadasi and Dwadasi celebrations at Sri Kalyana Venkateswara temple, Srinivasa Mangapuram, TTD is organising special pujas.
On the occasion of Vaikunta Ekadasi, the Dhanur masa Kainkaryas including Tomala, kouvu and panchanga Shravana will be held in Ekantham between 12.05-2.30 am in the early hours of December 23 and devotees allowed Sarva Darshan between 2.30 am to evening 4.00 pm.
Earlier between 6.00-7.00 am Swami and Amavaru will be paraded on Bangaru Tiruchi on Mada streets.In the evening Sarva Darshan is provided from 5.00-9.00 pm,
Similarly on December 24 morning after Dhanur masa Kainkaryas etc chakra snanam is performed between 10am and 11 am.
On the new year as per the English calendar day on January 1 after Dhanur masa and daily Kainkaryas Sarva Darshan is provided between 7.00 am to, evening 5.00 pm and again after night Kainkaryas, Darshan is resumed from6.00pm to 8 pm.
In view of the festivities, TTD has cancelled Arjita Kalyanotsavam on December 23, 24 and January 1.
The artists of Dharmic projects and Annamacharya projects present Bhakti sangeet and sankeertans in the temple.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
డిసెంబరు 23న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు
తిరుపతి, 2023 డిసెంబరు 18: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 2.30 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం ఏకాంతంగా నిర్వహిస్తారు. వేకువజామున 2.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 6 నుండి 7 గంటల వరకు బంగారు తిరుచ్చిపై స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు రాత్రి కైంకర్యాలు తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
అదేవిధంగా డిసెంబరు 24న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4 నుండి 5.30 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, ఉదయం 5.30 నుండి 7.30 గంటల వరకు తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు చక్రస్నానం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా డిసెంబరు 23, 24వ తేదీల్లో ఆర్జిత కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆలయంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.