SPECIAL SAHASRA KALASABHISHEKAM ON JUNE 17_ జూన్‌ 17న శ్రీ భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం

Tirumala, 10 Jun. 18: Marking the auspicious occasion of consecration of Sri Bhaga Srinivasa Murthy in Tirumala Temple by Pallavi queen Samavai, TTD will observe Special Sahasra Kalasabhishekam on June 17.

According to the available literature on the wall of First Prakaram, Sri Peru devi, also known as Samavai has donated an 18-inch silver idol of Lord in 614 AD which is known as Manavala Perumal or Koutuka Beram.

The special abhishekam will be performed at Bangaru Vakili next Sunday between 6am and 8am by Archakas. Temple officials will take part in this fete. All other Arjitha sevas will be performed as usual on this day.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్‌ 17న శ్రీ భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం

జూన్‌ 10, తిరుమల, 2018: తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి జూన్‌ 17వ తేదీన ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం జరుగనుంది. 12 ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల నడుమ శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చకస్వాములు ఏకాంతంగా సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంనాడు శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా కొనసాగుతాయి.

చారిత్రక నేపథ్యం :

పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. పల్లవరాణి కానుకకు సంబంధించిన ఈ శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారం శ్రీవారి ఆలయంలోని పంచబేరాల్లో ఒకరైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి అని, శ్రీ మనవాళపెరుమాళ్‌ అని కూడా పిలుస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.