SPECIAL UTSAVAS OF DECEMBER AT SRI GT _ డిసెంబ‌రులో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 4 Dec. 19: TTD will roll out following special festivals in the TTD local temple of Sri Govindaraja Swamy during December, 2019:

  • December 6,23,20,27: On all Fridays’ procession of Sri Andal Ammavaru on mada streets in the evening.
  • December 5: Procession of Ammavaru with Anjaneya Swamy on mada streets.
  • December 10: Sri Thirumangaialwar Sattumora.
  • December 11: Sri Govindaraja Swamy visit to Kapila theertha for Kartika Parva Deepotsavam.
  • December 19: Sri Govindaraja Swamy and consorts evening procession on Uttara nakshatram.
  • December 29: Evening procession of Sri Kalyana Venkateswara with consorts on mada streets on Sravana nakshatram.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

డిసెంబ‌రులో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2019 డిసెంబరు 04:  తిరుపతిలో టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబ‌రులో జరుగనున్న ఉత్సవాల వివరాలిలా ఉన్నాయి.

–     డిసెంబ‌రు 6, 13, 20, 27వ తేదీల్లో శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు ఆలయ మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.

–     డిసెంబ‌రు 5న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఉభ‌య‌నాంచారుల‌తో కూడిన శ్రీ గోవింద‌రాజ‌స్వామివారిని ఎదురు ఆంజనేయ‌స్వామివారి స‌న్నిధికి వేంచేపు చేస్తారు. సాయంత్రం 5.30 గంట‌ల‌కు స్వామి అమ్మ‌వార్ల‌తోపాటు శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారిని మాడ వీధుల్లో ఊరేగిస్తారు.

–      డిసెంబ‌రు 10న శ్రీ తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర సంద‌ర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ తిరుమంగైయాళ్వార్‌తో కలిసి సాయంత్రం 5.30 గంట‌ల‌కు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

–        డిసెంబ‌రు 11న ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీ గోవింద‌రాజస్వామివారు క‌పిలతీర్థానికి వేంచేపు చేస్తారు. సాయంత్రం 6 గంట‌ల‌కు ఆల‌యంలో కార్తీక ప‌ర్వ దీపోత్స‌వం నిర్వ‌హిస్తారు.

–       డిసెంబ‌రు 19న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు.

–       డిసెంబ‌రు 29న శ్ర‌వ‌ణా నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.