SPIRITUAL BOOKS RELEASED_ భక్తజనబాహుళ్యంలోకి పురాణ ఇతిహాసాలు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
Tirupati, 21 Dec. 18: The spiritual books will be released and measures will be taken to make them reach devotees, said Tirupati JEO Sri P Bhaskar.
The book release programme took place in Annamacharya Kalamandiram in Tirupati on Friday evening. The JEO said, anong all the spiritual books, Mahabharatam has got unique place and hence known as Panchama Vedam.
Earlier he released Sri Vedavyasa Virachitam Mahabharatam book in Telugu and Sanskrit. He said with the help of Rastriya Samskrita Vidya Peetham, the translation works of the epic book completed in one and a half years.
Publication wing special officer, Sri Anjaneyulu, RSVP Registrar Sri GSR Krishnamurthy and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
భక్తజనబాహుళ్యంలోకి పురాణ ఇతిహాసాలు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
తిరుపతి, 2018 డిసెంబరు 21: ధర్మప్రచారంలో భాగంగా పురాణ ఇతిహాసాలను జనబాహుళ్యంలోకి తీసుకొస్తున్నామని, తద్వారా అందులోని ధర్మసూత్రాలను ఇప్పటితరానికి తెలియజేసేందుకు వీలవుతుందని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ వెల్లడించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం సాయంత్రం టిటిడి ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో ముద్రించిన శ్రీ వేదవ్యాసవిరచితమ్ శ్రీమన్మహాభారతమ్ తెలుగు, సంస్కృత గ్రంథాలను జెఈవో ఆవిష్కరించారు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం రిజిస్ట్రార్ ఆచార్య జిఎస్ఆర్.కృష్ణమూర్తి, టిటిడి ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి డా.. తాళ్లూరి ఆంజనేయులు కలిసి తాత్పర్యసహిత వ్యాసభారతం రచన ఒప్పందపత్రాలను మార్చుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ అన్ని గ్రంథాలలో ఉత్తమమైనది, పవిత్రమైనది మహాభారతమని, ఇందులో నవరసాలు ఉన్నాయని తెలిపారు. సమాజంలో ఎలా జీవించాలో తెలిపే మౌలిక సూత్రాలు ఉన్నాయన్నారు. భారతంలోని ప్రతి పాత్రలోనూ ఒక ధర్మసూత్రం దాగి ఉంటుందని, ముఖ్యంగా ధర్మరాజు ధర్మానికి, భీముడు వీరత్వానికి, అర్జునుడు పరాక్రమానికి, నకుల సవదేవులు ఆరోగ్యానికి ప్రతీకలని వివరించారు. టిటిడి ప్రచురణలను వేగవంతం చేసేందుకు 2011లో ప్రత్యేకంగా ప్రచురణల విభాగాన్ని ఏర్పాటు చేశామని, అప్పటినుండి ఇప్పటివరకు 250 పుస్తకాల ప్రచురణ జరిగిందని, మరో 50 గ్రంథాలు సిద్ధమవుతున్నాయని తెలియజేశారు. శ్రీమన్మహాభారతమ్ మూలాన్ని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంవారి సహకారంతో తెలుగు, సంస్కృత భాషల్లో ముద్రించి ఆవిష్కరించామని తెలిపారు. దీంతోపాటు సామాన్య పాఠకులకు సైతం అర్థమయ్యేలా తెలుగు లిపిలో మూలంతోపాటు తాత్పర్యాన్ని 18 నెలల వ్యవధిలో అందించాలనే సంకల్పంతో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంతో ఒప్పందం చేసుకున్నామని వివరించారు. అనంతరం జెఈవోతోపాటు, ఇతర ప్రముఖులకు సన్మాన కార్యక్రమం జరిగింది. టిటిడి ప్రచురణల విభాగం ఉపసంపాదకులు డా.. నొస్సం నరసింహాచార్య వందన సమర్పణ చేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా.. సముద్రాల లక్ష్మణయ్య, శ్రీనివాస వాఙ్మయ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా.. మేడసాని మోహన్, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం మహాభారతం ప్రాజెక్టు సమన్వయకర్త ఆచార్య రాణి సదాశివమూర్తి, భక్తి వేదాంత ట్రస్టు ప్రతినిధి డా.. వైష్ణవాంఘ్రి సేవక దాస్, తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు సమన్వయాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.