SPIRITUAL FERVOUR GRIPS ANJANADRI TIRUMALA _ శాస్త్రోక్తంగా హనుమాన్ జన్మస్థలం అభివృద్ధి – సుందరీకరణ పనులకు భూమి పూజ
FLOWER AND FRUITS DECORATIONS STAND AS ADDED ATTRACTION
TIRUMALA, 16 FEBRUARY 2022: The entire premises of Anjanadri ranges in Tirumala was spellbound in the spiritual fervour of the rhythmic chants of Hanuman Nama on the auspicious occasion of the Bhoomi Puja held near Akasa Ganga on Wednesday.
The foundation stone laying ceremony to takeup development and beautification works in the existing Anjanadevi Sameta Sri Bala Anjaneya Swamy temple on the Anjanadri hills was carried out under the supervision of TTD Agama Advisor and Kankanabhattar Sri Mohana Rangacharyulu.
The event was graced by HH Sri Swarupanandendra Saraswathi Swamy of Visakha Sarada Peetham along with Junior Pontiff Sri Swatmanandendra Saraswathi, Chitrakoota Peethadhipathi Sri Ramabhadracharya, Ramajanmabhoomi Trust Treasurer Sri Govind Devi Giri Maharaj, VHP Joint Secretary Sri Koteswara Sarma. TTD Chairman Sri YV Subba Reddy, EO Dr. KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, JEO Sri Veerabrahmam, CVSO Sri Gopinath Jatti, and other officers were present. Donors Sri N Nageswara Rao, Sri K Murali Krishna were also present.
The sequence of Vedic events during the Sankusthapana Mahotsavam included Rakshabandhanam, Ankurarpanam, Panchagavyaradhana, Vastu Homam, Vastu Darsanam, Shankabhishekam, Ratnanyasam, Pradhama Silasthapana and Bhoomi Puja were performed.
CORN PANDAL ATTRACTS DEVOTEES
The premiere stage was decked with colorfully decorated pandal with flowers while the roof was covered with varieties of fruits and corn.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శాస్త్రోక్తంగా హనుమాన్ జన్మస్థలం అభివృద్ధి – సుందరీకరణ పనులకు భూమి పూజ
ఆకట్టుకున్న ఫల, పుష్పాలంకరణలు
తిరుమల, 2022 ఫిబ్రవరి 16: తిరుమల అంజనాద్రిలో ఆకాశ గంగ వద్ద హనుమంతుని జన్మస్థలం అభివృద్ధి పనులకు బుధవారం టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డిలు కలిసి శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామి, అయోధ్య శ్రీ రామజన్మ భూమి ఆలయ నిర్మాణ ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్, చిత్రకూట్ పీఠాధిపతి శ్రీ రామభద్రాచార్యులు, శ్రీ కోటేశ్వర శర్మలు పాల్గొన్నారు.
టిటిడి వైఖానస ఆగమ సలహదారులు మరియు కంకణబట్టార్ శ్రీ మోహన రంగాచార్యులు ఆధ్వర్యంలో రుత్వికులు రక్షబంధన పూజ, అంకురార్పణ, పంచగవ్యారాధన, వాస్తుహోమం, శిలలకు వాస్తు దర్శనం, శంఖునకు అభిషేకం, విశేష హోమాలు, రత్నన్యాసం, ప్రథమ శిలా స్థాపన, భూ పూజ నిర్వహించారు. టిటిడి మాజీ బోర్డు సభ్యులు (దాతలు) శ్రీ నాగేశ్వరరావు, శ్రీ మురళీ కృష్ణ ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ఫల, పుష్పాలంకరణలు :
ఆకాశగంగ వద్ద భూమి పూజ ప్రాంగణంలోని వేదికపై ఏర్పాటు చేసిన ఫల, పుష్పాలంకరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆపిల్, ద్రాక్ష, పైనాపిల్, మొక్కజోన్న, రోజా, సంపంగి, కట్ ఫ్లవర్స్‌తో అద్బుతంగా రూపొందించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.