SPORTS ACTIVITY ENSURES A BRIGHT FUTURE FOR STUDENTS SAY TIRUPATI JEO _ క్రీడ‌ల సాధ‌నతో విద్యార్థుల‌కు మంచి భ‌విష్య‌త్తు: టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

Tirupati, 19 Dec. 19: Tirupati Joint Executive Officer, Sri P Basant Kumar has said today that besides studies, sports activities enhanced physical and mental capabilities of students and thereby provided them a bright future.

He was inaugurating the 24th inter-polytechnic sports and games meet jointly hosted by TTD and the Govt of AP at the Sri Padmavati Mahila Polytechnic institutions on Thursday morning.

 

As a chief guest he said sports should be made a mandatory curriculum of studies in polytechnics Win or lose was part of the sports which enhanced the stamina of the students he said adding that nowadays students ignored sports but focused only on studies and as a result, any set back pushed them into depression.

 

He said TTD institutions had good playgrounds and sports infrastructure and hoped that students exploited the opportunities and excelled in national and international events.


Technical education department SVU regional director Sri V Padma Rao urged students to pay equal stress for both studies and sports as the later earned them better recognition and quota for higher studies and also jobs. In 2020 January net state-level competitions would be held, he added 

TTD DFO Sri D Phani Kumar Naidu said sports participation enhanced physical and personality development besides self-confidence among students.

TTD DEO Dr Ramana Prasad TTD will soon introduce a sports policy to develop sports infrastructure and also train budding sports talents in a big way. 

Dr G Asunta, principal of Sri Padmavati Mahila Polytechnic welcomed the gathering.

Earlier flags of national sports and polytechnic institutions were hoisted and sports lamp was lighted besides bright and colourful balloons were released signalling the commencement of competitions.

Coordinator of Polytechnic institutions Dr L Krishna sai and sports girls from 29 polytechnics participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

క్రీడ‌ల సాధ‌నతో విద్యార్థుల‌కు మంచి భ‌విష్య‌త్తు : టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌

శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభం

తిరుప‌తి, 19 డిసెంబ‌రు 2019: విద్యార్థులు చ‌దువుతోపాటు క్రీడ‌ల‌ను సాధ‌న చేయ‌డం ద్వారా శారీర‌కంగా, మాన‌సికంగా బ‌ల‌ప‌డ‌తార‌ని, త‌ద్వారా మంచి భవిష్య‌త్తు ఉంటుంద‌ని టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ సాంకేతిక విద్యాశాఖ‌, టిటిడి ఆధ్వ‌ర్యంలోని శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల సంయుక్తంగా  చేప‌ట్టిన 24వ బాలిక‌ల జిల్లాస్థాయి అంత‌ర‌ పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ గురువారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది.

          ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ విద్యార్థుల దిన‌చ‌ర్య‌లో క్రీడ‌లు భాగం కావాల‌ని, క‌ళాశాల‌ల్లో విధిగా సాధ‌న చేయించాల‌ని కోరారు. క్రీడ‌ల్లో గెలుపోట‌ములు భాగ‌మ‌ని, దీనివ‌ల్ల క్రీడాకారులు మాన‌సిక స్థైర్యంతో ఉంటార‌ని తెలిపారు. ఇటీవ‌ల విద్యార్థులు చ‌దువుపై ఎక్కువ శ్ర‌ద్ధ పెట్టి క్రీడ‌ల‌ను విస్మ‌రిస్తున్నార‌ని, దీనివ‌ల్ల జీవితంలో ఓట‌మి ఎదురైతే కుంగిపోతున్నార‌ని చెప్పారు. టిటిడి క‌ళాశాల‌ల్లో చ‌క్క‌టి మైదానాలున్నాయ‌ని, విద్యార్థిని విద్యార్థుల‌ను క్రీడ‌ల్లో ప్రోత్స‌హిస్తున్నామ‌ని తెలిపారు. టిటిడి విద్యార్థులు జిల్లా, రాష్ట్ర‌స్థాయి, జాతీయ స్థాయిలో రాణించాల‌ని ఆకాంక్షించారు.

సాంకేతిక విద్యాశాఖ ఎస్‌వియు రీజ‌న‌ల్ జాయింట్ డైరెక్ట‌ర్ శ్రీ వి.ప‌ద్మారావు మాట్లాడుతూ విద్యార్థులు చ‌దువుకు, క్రీడ‌ల‌కు స‌మ ప్రాధాన్యం ఇవ్వాల‌న్నారు. క్రీడ‌ల్లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన‌వారికి ఉన్న‌త విద్య‌లో, ఉద్యోగాల్లో రిజ‌ర్వేష‌న్ ఉంద‌ని, విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. 2020 జ‌న‌వ‌రిలో రాష్ట్రస్థాయిలో ఈ క్రీడాపోటీలు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

టిటిడి డిఎఫ్‌వో శ్రీ డి.ఫ‌ణికుమార్ నాయుడు మాట్లాడుతూ క్రీడ‌ల్లో పాల్గొన‌డం ద్వారా మంచి వ్య‌క్తిత్వం, ఆత్మ‌విశ్వాసం అల‌వ‌డ‌తాయ‌న్నారు. టిటిడి విద్యాశాఖాధికారి డా. ఆర్.ర‌మ‌ణ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ టిటిడి ఒక క్రీడావిధానాన్ని రూపొందించి, మైదానాల‌ను అభివృద్ధి చేస్తోంద‌ని, విద్యార్థిని విద్యార్థుల‌ను ప్రోత్స‌హిస్తోంద‌ని వివ‌రించారు. శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా పాలిటెక్నిక్ క‌ళాశాల ప్రిన్సిపాల్ డా. జి.అసుంత స్వాగ‌తోప‌న్యాసం చేశారు.

ముందుగా క్రీడా మైదానంలో జాతీయ‌, క్రీడ‌, క‌ళాశాల జెండాల‌ను జెఈవో ఆవిష్క‌రించారు. అనంత‌రం క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడాకారులు క‌వాతు చేశారు. ఈ సంద‌ర్భంగా బెలూన్లు ఎగుర‌వేశారు. అనంత‌రం క్రీడాపోటీలు ప్రారంభ‌మ‌య్యాయి.

ఈ కార్య‌క్ర‌మంలో పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల కో-ఆర్డినేట‌ర్ డా. ఎల్‌.కృష్ణ‌సాయి, 29 పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల నుండి క్రీడాకారిణులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.