SPORTS AND GAMES PRIZES DISTRIBUTED _ శరీరక ధృడత్వంతో పాటు మానసిక ఉత్తేజంతో భక్తులకు మరింత మెరుగైన సేవలందించాలి : టిటిడి ప్ర‌జా సంబంధాల అధికారి డా.టి.ర‌వి

శరీరక ధృడత్వంతో పాటు మానసిక ఉత్తేజంతో భక్తులకు మరింత మెరుగైన సేవలందించాలి : టిటిడి ప్ర‌జా సంబంధాల అధికారి డా.టి.ర‌వి

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 25: ఉద్యోగులు పని ఒత్తిడిని అధిగమించడానికి, మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి మాత్రమే కాకుండా భక్తులకు విశేష రీతిలో సేవలు అందించడానికి క్రీడలు దోహదపడతాయని టిటిడి ప్ర‌జా సంబంధాల అధికారి డా.టి.ర‌వి పేర్కొన్నారు. టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం శుక్ర‌వారం సాయంత్రం తిరుపతి మహతి కళాక్షేత్రంలో జరిగింది.

ఈ కార్యక్రమానికి ప్ర‌జా సంబంధాల అధికారి డాక్టర్ రవి ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు ప్రతి రోజు విచ్చేసే వేలాది మంది భక్తులకు విశేష సేలందిస్తున్న ఉద్యోగులు తీవ్ర ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ ఒత్తిడిని అదిగమించడానికి, శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

ఉద్యోగుల సంక్షేమం కోసం టిటిడి కట్టుబడి ఉందని చెప్పారు. ఉద్యోగులు ప్రతిరోజూ దైనందిన జీవనంలో కొంత సమయం ఏదో ఒక క్రీడను సాధన చేయాలన్నారు. దీనివల్ల శారీరక ఆరోగ్యంతోపాటు విధుల్లోనూ చురుగ్గా ఉంటారని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 9 నుండి 23వ తేదీ వ‌ర‌కు కోవిడ్ – 19 నిబంద‌న‌లు పాటిస్తూ ఉద్యోగులు ఉత్సాహంగా క్రీడ‌ల్లో పాల్గొన్నార‌న్నారు. క్రీడ‌ల్లో విజయం సాధించిన ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలియజేశారు.

ట్రెజరీ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు మాట్లాడుతూ రోజు క్రీడలు, వ్యాయమం చేయాలని, ఉద్యోగులలో క్రీడా స్పూర్తి పెరిగితే ఆరోగ్యంగా వుంటారని సూచించారు. క్రీడలలో పాల్గొనడం ద్వారా పోటీతత్వం, మానసిక ఉల్లాసం వృద్ధి చెందుతాయని వివరించారు.

అనంతరం టిటిడి ఉద్యోగుల పిల్లలకు సాంస్కృతిక పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

వివిధ క్రీడాపోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సంక్షేమాధికారి శ్రీ దామోద‌రం, డెప్యూటీ ఈవో శ్రీగోవింద‌రాజ‌న్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఉద్యోగుల్లో మొత్తం 495 మంది ప్రథమ, 418 మంది ద్వితీయ, 84 మంది తృతీయ బహుమతులు అందుకున్నారు. మొత్తం వివిధ విభాగాల్లో 873 మంది ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు క్రీడాపోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 542 మంది పురుషులు, 331 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.

అంతకుముందు టిటిడి వార్షిక క్రీడా పోటీల నివేదికను శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళ డిగ్రీ, పిజి క‌ళాశాల ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఉషారాణి వివరించగా, తెలుగు విభాగాదిప‌తి డా.క్రిష్ణ‌వేణి ముగింపు సందేశం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

Tirupati, 25 Feb. 22: The Prize Distribution Ceremony was held for employees in Mahati Auditorium on Friday evening, who won in various sports and games held between February 9 and 23 by TTD.

 

TTD PRO Dr T Ravi and Deputy EO Treasury Sri Devendrababu, speaking on the occasion said the sports and games will not only enhance physical strength but also enables to gain mental fitness which help to work in office and render services to pilgrims with more enthusiasm. TTD mandarins are encouraging the employees to enhance their sportive spirit by organizing sports and games every year.

 

Earlier fancy dress competition was held to the children of TTD employees and prizes were distributed to them.

 

Later prizes were distributed to winners and runners of all age categories of employees, retires employees by Welfare Officer Sri Damodaram, Devasthanams Education Officer Sri Govindarajan.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI