SRAVANA POURNAMI GARUDA SEVA OBSERVED_ వైభ‌వంగా శ్రావ‌ణ‌ పౌర్ణమి గరుడసేవ

Tirumala, 15 Aug. 19: The Garuda Seva was observed in Tirumala with religious gaiety on Thursday.

On the auspicious occasion of Sravana Pournami this celestial fete was observed between 7pm and 9pm.

Devotees gathered in large numbers in galleries to catch the glimpse of Sri Malayappa Swamy on Garuda Vahanam.

Temple DyEO Sri Harindranath, Peishkar Sri Lokanatham and temple staff were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభ‌వంగా శ్రావ‌ణ‌ పౌర్ణమి గరుడసేవ

తిరుమల, 2019 ఆగ‌స్టు 15: తిరుమలలో గురువారం రాత్రి శ్రావ‌ణ‌పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు త‌న‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, పేష్కార్ శ్రీ లోక‌నాథం ఇత‌ర అధికారులు, విశేషంగా భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.