CVSO INSPECTS SRAVANAM_ ‘శ్రవణం’ ప్రాజెక్టులో సివిఎస్వో శ్రీ ఆకే రవికృష్ణ తనిఖీలు

Tirupati’, 15 September 2017. The CVSO of TTD Sri Ake Ravikrishna today inspected the premises where infants were treated for hearing impair nets under the Saravanan a project.

He enquired about accommodation,a food a,trainaing and treatment for the kids from the parents of the ailing Children and also inspected the equipments and class rooms.

TTD VGO smtsadalakshmia and other senior officials were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

‘శ్రవణం’ ప్రాజెక్టులో సివిఎస్వో శ్రీ ఆకే రవికృష్ణ తనిఖీలు

తిరుపతి, 15 సెప్టెంబరు 2017: తిరుపతిలో టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రవణం ప్రాజెక్టులో చిన్నారులకు అందుతున్న సౌకర్యాలను టిటిడి సివిఎస్వో శ్రీ ఆకే రవికృష్ణ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు.

చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు కల్పిస్తున్న వసతులు, భోజన సౌకర్యం, శిక్షణ తదితర అంశాలపై అడిగితెలుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం ప్రాజెక్టు తరగతి గదులను, శిక్షణ పరికరాలను పరిశీలించారు. విద్యార్థులకు ఆసౌకర్యం కలుగకుండా మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి విజివో శ్రీమతి సదాలక్ష్మీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.