SRI BHEESHANA NARASIMHA PUJA AT VASANTHA MANDAPAM _ వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా శ్రీ భీషణ నృసింహ పూజ‌

Tirumala, 25 May 2021: As part of its Vaisakha month programs and seeking divine intervention to ward off the ill effects of Covid-19 across the world, TTD organised Sri Bheeshana Narasimha puja on the auspicious occasion of Sri Narasimha Jayanti at Vasantha Mandapam in Tirumala on Tuesday.

The program was live telecasted by SVBC between 8.30am and 10.30 am.

A part of festivities Sri Malayappa in Narasimha alankaram was seated on Simha vahana with Sudarshan chakra. Narasimha Mantra was recited for 108 times and Sudarshana mantra for 24 times were also chanted by ritwiks.

Speaking on the occasion Sri Govindananda Saraswati Swami from Hampi narrated the epic story of how Maha Vishnu incarnated as Narasimha on a plea of Bhakta Prahlada on the Chaturthi day and eradicated evil forces.

He also lauded the efforts of TTD to organise the Puja in Tirumala on the occasion of the Narasimha Jayanti for the benefit of the entire humanity.

The TTD Additional EO Sri AV Dharma Reddy, Srivari Temple DyEO Sri Harindranath, Vaikhanasa Agama Advisor Sri Mohanaracharyulu, archakas, Veda pundits and Veda Parayanadars were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా శ్రీ భీషణ నృసింహ పూజ‌

తిరుమల, 2021, మే 25: వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా నృసింహ జ‌యంతిని పుర‌స్కరించుకుని తిరుమల‌ వసంత మండపంలో మంగ‌ళ‌వారం శ్రీ భీషణ నృసింహ పూజ శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఉదయం 8.30 నుండి 10.30 గంటల‌ వరకు జ‌రిగిన ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

ఇందుకోసం శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని నృసింహ అలంకారంలో సింహ వాహ‌నంపై కొలువుదీర్చారు. సుద‌ర్శ‌న చ‌క్రం, నర‌సింహుని ప్ర‌తిమ‌ను ఏర్పాటుచేశారు. అభిముఖంగా శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ప్ర‌తిమ‌లను ఆశీనుల‌ను చేశారు.

ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన హంపీ క్షేత్రానికి చెందిన శ్రీ గోవిందానంద స‌ర‌స్వ‌తి స్వామీజీ మాట్లాడుతూ బాలుడైన భ‌క్త ప్ర‌హ్లాదుడు భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో భ‌గ‌వంతుని ప్రార్థించ‌గా నృసింహావ‌తారంలో శ్రీ‌మ‌హావిష్ణువు ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు తెలిపారు. చ‌తుర్ద‌శి రోజున సంధ్యా స‌మ‌యంలో న‌ర‌సింహుడు ఆవిర్భ‌వించి దుష్టసంహారం చేసిన‌ట్టు వివ‌రించారు. నృసింహ జ‌యంతి రోజున స్వామివారిని ప్రార్థిస్తే వ్యాధి బాధ‌లు తొల‌గుతాయ‌ని, క‌ష్టాలు దూర‌మ‌వుతాయ‌ని చెప్పారు. శేషాచ‌ల క్షేత్రంలో టిటిడి నిర్వ‌హిస్తున్న ఇలాంటి కార్య‌క్ర‌మాల వ‌ల్ల మాన‌వాళికి శాంతిసౌఖ్యాలు క‌లుగుతాయ‌న్నారు.

వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ ఎన్‌.వి.మోహ‌న‌రంగాచార్యులు మాట్లాడుతూ కరోనా మహమ్మారిని మానవాళికి దూరం చేయాలని ప్రార్థిస్తూ శ్రీ భీషణ నృసింహ పూజ నిర్వహించినట్టు తెలిపారు. పూజ‌లో భాగంగా నృసింహ మంత్రాన్ని 108 సార్లు, సుద‌ర్శ‌న మంత్రాన్ని 24 సార్లు పారాయ‌ణం చేసినట్టు చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్రనాథ్‌, అర్చ‌క‌స్వాములు, వేద‌పండితులు, వేద‌పారాయ‌ణ‌దారులు పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయంలో శ్రీ నృసింహ జయంతి

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగ‌ళ‌వారం నృసింహ జయంతి జరిగింది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవం నిర్వ‌హిస్తారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేశారు.

శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉంది. యోగముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతులలో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.