SRI DHANVANTHRI MAHA MANTRA GOES GLOBAL _ “యోగవాశిస్టం – శ్రీ ధన్వంతరి మహామంత్రం” పారాయణానికి విశేష స్పందన
TTD PLACES THE SLOKAS IN ITS WEBSITE FOR DEVOTEES
SVBC LIVE TELECAST PARAYANAMS
Tirumala, 23 April 2020 : Following the over response by devotees for the live telecast of Yoga vasistha Dhanvantari Maha Mantra, the TTD has uploaded the slokas on its website for devotees to conduct parayanams at their own convenience.
In response to the devotee following slokas are uploaded in Tamil, Telugu and Sanskrit on the TTD website www.tirumala.org and also the SVBC portal of www.svbcttd.com with right click option of free downloads.
SIGNIFICANCE OF YOGA VASISTHA MANTRAS
The legends say that the Yoga Vashisth mantra with 32,000 slokas represented the Tatvika image of Sri Rama as indicated by Maharshi Valmiki in Ramayana.
According to Sri Kuppa Shiva Subramaniam Avadhani, Principal of the Dharmagiri Veda Vignana Peetham, the unique mantra appeared in the 69 th chapter (third subsection of the 6th section) and comprises 17 slokas.
MAHA MANTRA PARAYANAMS FROM APRIL 10
For the well being of humanity from the clutches of pandemic corona virus COVID 19, TTD launched the parayanams of the Yoga Vasistha Dhanvantari Maha Mantra on April 10th under the aegis of Dharmagiri Veda Vignan Peetham at the NadaNeerajanam platform. 25 Vedic pundits including students of Dharmagiri Veda Peetham perform the parayanams daily.
The pundits also chant, Sri Durga Parameshwari Stotram conceived by the Pontiff of Sharada Peetham along with the Dhanwantari Mantra.
Apart from the Yoga Vasistha Dhanvantari Maha Mantra Parayanam, the Sloka Parayanam is done from the Ranganayakula mandapam inside Srivari temple between 9am-10am and is live telecasted by the SVBC.
HUGE RESPONSE FOR SVBC TELECAST
Devotees across the world are following and chanting the slokas which could subside the ill effects of specific micro bacteria mentioned in Yoga Vasishta (Visoochika Nivarana Mantram) being chanted by Sri Avadhani team on SVBC. Even senior officials of TTD are also participating in the chanting of slokas at Nada Niranjana platform. The Vedic pundits of Dharmagiri Peetham are also reciting Yajurveda and other Vedas at the RangaNayakula mandapam.
It may be recalled that the live telecasting of series of Parayanams and Yagams commenced on SVBC with Srinivasa Veda Mantra Arogya Japa Yagnam from March 16 followed by Dhanwantari Yagam, Sloka Parayanam which have continued till date.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
“యోగవాశిస్టం – శ్రీ ధన్వంతరి మహామంత్రం” పారాయణానికి విశేష స్పందన
వెబ్‌సైట్‌లో శ్లోకాలు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
ఎస్వీబీసీ లైవ్ ద్వారా అనుసరిస్తున్న భక్తులు
రంగనాయకుల మండపంలోనూ వేదపారాయణం
తిరుమల, 2020 ఏప్రిల్ 23 ;ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి ప్రారంభించిన “యోగవాశిస్టం – శ్రీ ధన్వంతరి మహామంత్రం” పారాయణానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల్లోని భక్తులు పెద్దసంఖ్యలో అనుసరిస్తున్నారు. భక్తులు డౌన్‌లోడ్ చేసుకుని పఠనం చేసేందుకు వీలుగా ఈ మంత్రాల కాపీలను తెలుగు, తమిళ, సంస్కృత భాషల్లో టిటిడి వెబ్‌సైట్(www.tirumala.org), ఎస్వీబీసీ వెబ్‌సైట్(www.svbcttd.com)లో అందుబాటులో ఉంచారు.
యోగ వాశిస్టంలో శ్రీరాముని తాత్విక స్వరూపం
ధర్మస్వరూపుడైన శ్రీరాముని ధార్మిక స్వరూపాన్ని శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం గ్రంథం ద్వారా లోకానికి తెలియజేశారు. అదేవిధంగా, రాముని తాత్విక స్వరూపాన్ని నిరూపించేందుకు శ్రీ వాల్మీకి మహర్షి 32 వేల శ్లోకాలతో వాశిష్ట మహారామాయణం అనే గ్రంథాన్ని రచించారు. దీన్ని యోగ వాశిస్టం అని కూడా అంటారు. ఇందులో మానవ వికాసానికి సంబంధించిన పలు అంశాలను వశిష్టుడు శ్రీరామునికి తెలియజేసినట్టు శ్రీ వాల్మీకి మహర్షి పేర్కొన్నారు. ఇందులో మొత్తం 6 ప్రకరణాలుండగా, మూడోదైన ఉత్పత్తి ప్రకరణంలో గల 69వ సర్గలో 17 శ్లోకాలతో విషూచికా(సూక్ష్మక్రిమి) నివారణ మంత్రం ఉన్నట్టు తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని తెలిపారు.
ఏప్రిల్ 10న పారాయణం ప్రారంభం
ఏప్రిల్ 10వ తేదీన “యోగవాశిస్టం – శ్రీ ధన్వంతరి మహామంత్రం” పారాయణాన్ని టిటిడి ప్రారంభించింది. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు నాదనీరాజనం వేదికపై “యోగవాశిస్టం – శ్రీ ధన్వంతరి మహామంత్రం” పారాయణం, ఆ తరువాత ఉదయం 9 నుండి 10 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపారాయణం జరుగుతోంది. ఈ కార్యక్రమాలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. నాదనీరాజనం వేదికపై యోగవాశిస్టం – శ్రీ ధన్వంతరి మహామంత్రంతోపాటు శృంగేరి జగద్గురువులు లోకానికి అందించిన శ్రీ దుర్గాపరమేశ్వరి స్తోత్రం, మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన శ్రీ ధన్వంతరి స్వామిని ప్రార్థిస్తూ శ్రీ ధన్వంతరి మహామంత్రాన్ని, ఆయా రోజుల్లో విశేషమైన స్తోత్రాలను ప్రతిరోజూ పారాయణం చేస్తున్నారు. వేద విజ్ఞానపీఠానికి చెందిన వేదపండితులు, విద్యార్థులు కలిపి 25 మంది ఈ పారాయణంలో పాల్గొంటున్నారు.
ఎస్వీబీసీ లైవ్‌లో అనుసరిస్తున్న భక్తులు
ఈ కార్యక్రమంలో శ్రీ కెఎస్ఎస్.అవధాని ఆధ్వర్యంలో వేదపండితులు యోగవాశిస్టంలోని విషూచికా(సూక్ష్మక్రిమి) నివారణ మంత్రంలో ఒక్కో శ్లోకాన్ని పలికిస్తారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న భక్తులు ఆ శ్లోకాలను పలుకుతూ వారిని అనుసరిస్తున్నారు. అదేవిధంగా ఇతర మంత్రాలను కూడా భక్తులు పఠిస్తున్నారు. నాదనీరాజనం వద్ద జరుగుతున్న పారాయణం కార్యక్రమంలో టిటిడిలోని పలు విభాగాల అధికారులు పాల్గొంటున్నారు. కాగా, రంగనాయకుల మండపంలో ప్రధానంగా యజుర్వేదం ఇతర వేదాలను కూడా పారాయణం చేస్తున్నారు. వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్‌తో కలిసి 15 మంది వేదపండితులు ఈ పారాయణం చేస్తున్నారు.
పలు యాగాల నిర్వహణ
కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని స్వామివారిని కోరుతూ ఇటీవల తిరుమలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మార్చి 16 నుండి 25వ తేదీ వరకు శ్రీనివాస వేదమంత్ర ఆరోగ్య జపయజ్ఞం, మార్చి 26 నుండి 28వ తేదీ వరకు శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగాన్ని టిటిడి నిర్వహించింది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.