SRI GODA GARLANDS DECORATES SRIVARU AT TIRUMALA _ తిరుమల శ్రీవారికి గోదా మాలలు

Tirumala, 15 Jan. 21: The presiding deity of Sri Venkateswara Swamy at Tirumala was adorned with Sri Goda garlands brought from Sri Govindarajaswami temple in Tirupati on Friday morning.

The garlands were presentations of Sri Godadevi (Goddess Andal ) as part of Sri Goda Parinayotsavam festival.

The holy garlands were first brought up to Pedda Jeeyar Mutt at Tirumala in the morning and later taken to Srivari temple with Mangala Vaidyams in a holy procession.

Later these garlands were adorned to Mula Virat of Sri Venkateswara after puja programs.

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswami and Sri Sri Sri Chinna Jeeyarswami, Temple DyEO Sri Harindranath, VGO Sri Bali Reddy and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

తిరుమల శ్రీవారికి గోదా మాలలు

తిరుమల, 2021 జనవరి 15: శ్రీవారికి మహా భక్తురాలైన (ఆండాళ్‌ అమ్మవారు) శ్రీ గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకొని గోదామాలాలు శ్రీవారి మూలవిరాట్‌కు శుక్ర‌వారం ఉదయం అలంకరించారు.

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని ఆండాళ్‌ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవిమాలాలు తిరుపతి నుండి శ్రీశ్రీశ్రీ తిరుమల పెద్ద జియ్యార్‌స్వామివారి మఠానికి శుక్ర‌వారం ఉదయం చేరుకున్నాయి. అనంతరం పెద్ద జియ్యార్‌ మఠం నుండి మంగళవాయిధ్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టుకు అలంకరించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌ స్వామి, శ్రీ గోవిందరాజ‌స్వామివారి ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు,  ఎవిఎస్వో శ్రీ గంగ రాజు, ఇత‌ర ఆల‌య అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.