SRI GODA PARINAYOTSAVAM HELD AT SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘ‌నంగా గోదా ప‌రిణ‌యోత్స‌వం

Tirupati, 15 Jan. 21: TTD organised a grand celebration of Sri Goda Parinayotsavam on Friday at Sri Govindarajaswami temple.

As part of the celestial event Melchat vastrams and garlands from Sri Pundarikavalli temple were taken on a procession and presented to Sri Andal Ammavaru in the morning after daily kaikaryams of Sahasra Namarchana etc.

Later in the evening the majestic festival of Sri Goda Parinayotsavam was celebrated at Sri Pundarikavalli temple.

Special grade DyEO Sri Rajendrudu, AEO Sri Ravikumar Reddy, Chief Archaka Sri Srinivasa Dikshitulu, Superintendents Sri Raj Kumar, Sri Venkatadri, Inspectors Sri Krishnamurthy, Sri Munidrababu and others were present.

 PARUVETA UTSAVA AT SRI GT ON JAN 16

As part of Paruveta Utsava at Sri Govindarajaswami temple on January 16, the utsava idols of Sri Govindarajaswami and His consorts and Goddess Sri Andal will be first taken on a procession within vimana prakaram.

Thereafter Asthanam will be conducted at Kalyana Mandapam and later returns to the temple in the evening.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘ‌నంగా గోదా ప‌రిణ‌యోత్స‌వం

 తిరుప‌తి, 2021 జ‌న‌వ‌రి 15: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం సంక్రాంతి గోదా ప‌రిణ‌యోత్స‌వంను ఘనంగా నిర్వహించారు. ‌ఇందులోభాగంగా  ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.
           
ఉద‌యం సుప్ర‌భాతంతో స్వామివారిని మేల్కొలిపి, స‌హ‌స్ర‌నామార్చ‌న చేప‌ట్టారు. అనంత‌రం ఉద‌యం 3 గంట‌ల‌కు శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి మేల్‌ఛాట్ వ‌స్త్రం, పూల‌మాల ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ ఆండాళ్ అమ్మ‌వారికి స‌మ‌ర్పించారు. అనంత‌రం అమ్మ‌వారికి స‌మ‌ర్పించిన మేల్‌ఛాట్ వ‌స్త్రం, పూల‌మాలల‌ను తిరుమ‌ల శ్రీ‌వారికి స‌మ‌ర్పించారు. 

కాగా, సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలోని శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యంలో వ‌ద్ద గోదా ప‌రిణ‌యోత్స‌వం నిర్వ‌హిస్తారు.

జనవరి 16న పార్వేట ఉత్సవం

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 16న పార్వేట ఉత్స‌వం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారిని, శ్రీ ఆండాళ్ అమ్మ‌వారిని ఆలయంలోని విమాన ప్రాకారంలో ఊరేగించి, క‌ల్యాణ‌మండ‌పంలో ఆస్థానం నిర్వ‌హిస్తారు. అనంత‌రం తిరిగి ఆల‌యానికి చేరుకుంటారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు , సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్ కుమార్, శ్రీ వెంక‌టాద్రి,  టెంపుల్ ఇన్సెక్టర్లు‌ శ్రీ కృష్ణమూర్తి, శ్రీ మునీంద్ర‌బాబు తదితరులు పాల్గొన్నారు.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.