SRI GOVINDARAJA SWAMY FLOAT FESTIVAL_ తెప్పపై శ్రీగోవిందరాజస్వామివారి విహారం

Tirupati, 30 January 2018: On the Day 6 of Teppotsavm at the Sri Govindaraja Swamy Temple, the utsava idol of Sri Govindaraja Swamy will be taken out on float along with his consorts in the evening and later paraded on the four mada streets.The float will take seven rounds in the Pushkarini.

The Annual Teppotsavam will conclude on Wednesday and Sri Govindaraja Swamy will also take seven rounds on the float and parade on four mada streets.

The artisans of HDPP and Annamcharya project will stage harikatha and bhakti sangeet on the occasion.

Among others DyEO Smt P Varalakshmi, AEO Sri Udayabhaskar Reddy, Supt Sri Jnaya Prakash, Temple inspector Sri Krishnamurthy and others participated in the event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

తెప్పపై శ్రీగోవిందరాజస్వామివారి విహారం

తిరుపతి, 2018 జనవరి 30: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. తెప్పలను అధిరోహించిన స్వామివారు శ్రీ గోవిందరాజస్వామివారి పుష్కరిణిలో మొత్తం ఏడు చుట్లు తిరిగి భక్తులకు అభయమిస్తారు.

కాగా బుధవారంతో తెప్పోత్సవాలు ముగియనున్నాయి. జనవరి 31వ తేదీ చంద్రగ్రహణం కారణంగా రాత్రి 10.00 నుండి 12.00 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు తెప్పపై ఏడుచుట్లు తిరిగి భక్తులను కటాక్షించనున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి పి.వరలక్ష్మి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీజ్ఞానప్రకాష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.