ఆగస్టు 15న శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రావణ ఉపకర్మ

ఆగస్టు 15న శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రావణ ఉపకర్మ

తిరుపతి, 2019 ఆగష్టు 13: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 15న గురువారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ వైభవంగా నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ కృష్ణ స్వామివారిని కపిలతీర్ధంలోని ఆళ్వార్‌తీర్ధంకు ఊరేగింపుగా తీసుకువెళ్ళి, స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుండి 6.00 గంటల వరకు శ్రీ భూ సమేత గోవిందరాజస్వామివారు ఆర్‌.ఎస్‌. మాడ వీధిలోని శ్రీ వైఖానసాచార్యులు ఆలయంలో ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.