KRT OBSERVES TWIN FETES_ శ్రీకోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
Tirupati, 13 Jul. 18: Sri Sita Rama Kalyanm and Hanumantha Vahana Sevas were observed in Sri Kodanda Rama Swamy temple in Tirupati on Friday.
In the morning the celestial wedding fete was performed in the advent of Punarvasu star, while in the evening, Hanumantha Vahana Seva was observed in connection with dark phase of the moon.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీకోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
హనుమంత వాహనంపై రాముల వారి అభయం
తిరుపతి, 2018 జూలై 13: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో పునర్వసు నక్షత్రం, అమావాస్య సందర్భంగా శుక్రవారం ఉదయం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, రాత్రి హనుమంత వాహనసేవ వైభవంగా జరిగాయి. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతినెలా కల్యాణం నిర్వహిస్తున్న విషయం విదితమే.
ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు సహస్ర కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. రూ.500/- చెల్లించి పాల్గొన్న గృహస్తులకు(ఇద్దరు) ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేశారు. ఆ తరువాత ఆలయంలోని కల్యాణమండపంలో ఉదయం 11 గంటలకు కల్యాణోత్సవ ఘట్టం ప్రారంభమైంది. అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న గ హస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేశారు.
సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ చేపట్టారు. సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగనుంది. రామభక్తుడైన హనుమంత వాహనసేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీ, ఏఈవో శ్రీతిరుమలయ్య, సూపరింటెండెంట్ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శేషారెడ్డి, శ్రీమురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.