SRI KODANDARAMA SWAMY SHINES ON SURY PRABHA _ సూర్యప్రభవాహనంపై శ్రీ కోదండరామస్వామి కటాక్షం
Tirupati,16, Feb 2024: On the auspicious day of Radhasapthami Sri Kodandarama Swami rode on Surya Prabha Vahanam on Friday along Mada streets.
Thereafter Swami took out celestial ride on Chandra Prabha Vahana at the night and blessed devotees.
DyEO Smt Nagarathna, Superintendent Sri Ramesh, Inspectors Sri Chalapathi and Suresh were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
సూర్యప్రభవాహనంపై శ్రీ కోదండరామస్వామి కటాక్షం
తిరుపతి, 2024 ఫిబ్రవరి 16: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం సూర్యప్రభవాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంలో మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు సూర్యప్రభవాహనంపై శ్రీ కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
అదేవిధంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తలు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.