SRI RUKMINI KRISHNA GRACE ON TEPPA _ తెప్పపై రుక్మిణీకృష్ణుల అభయం
TIRUMALA, 04 MARCH 2023: Sri Krishna Swamy along with Rukmini glided swiftly on the sacred waters of Swamy Pushkarini on the finely decked float on a pleasant evening on Saturday.
The deities blessed devotees on the float in three rounds.
Both the senior and junior pontiffs of Tirumala, EO Sri AV Dharma Reddy, Trust Board member Sri Ashok Kumar, SE 2 Sri Jagadeeshwar Reddy, DyEO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy and others were present.
తెప్పపై రుక్మిణీకృష్ణుల అభయం
తిరుమల, 2023 మార్చి 04: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం రుక్మిణీకృష్ణులు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు. విద్యుద్దీపాలు, పుష్పాలతో శోభాయమానంగా తెప్పను అలంకరించారు.
ముందుగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి సమేత శ్రీకృష్ణుల ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. రుక్మిణీకృష్ణులు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈఓ శ్రీ ఏవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, విజిఓ బాలిరెడ్డి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు , ఇతర అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.